Site icon HashtagU Telugu

Niharika and Chaitanya: నిహారిక, చైతన్య విడాకులు? చక్కర్లు కొడుతున్న రూమర్స్!

Niharika

Niharika

మెగా డాటర్ నిహారిక, భర్త చైతన్య వీడిపోతున్నారా? గతకొంతకాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు చోటుచేసుకుంటున్నాయా? అంటే అవుననే అంటోంది టాలీవుడ్ మీడియా. నిహారిక, చైతన్య (Niharika and Chaitanya) వీడిపోతున్నట్టు గతంలో చాలాసార్లు వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా నిహారిక, చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలో అందరినీ ఫాలో అవుతున్న చైతన్య.. నిహారికను మాత్రం అన్‌ఫాలో చేయడం ఆశ్చర్యకరం. అంతేకాదు, తమ పెళ్లి ఫొటోలను సైతం చైతన్య ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశారు. నిహారికతో దిగిన ఒక్క ఫొటో కూడా ఇప్పుడు చైతన్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో లేదు.

దీంతో నిహారిక, చైతన్య (Niharika and Chaitanya) విడాకులు తీసుకోతున్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. నిజానికి నిహారిక, చైతన్యలది ప్రేమ వివాహం. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. జంట చూడముచ్చటగా ఉందని అప్పట్లో వీరిపై ప్రశంసల జల్లు కురిసింది. ఇప్పుడు ఈ జంట (Niharika and Chaitanya) విడిపోతోంది అనే వార్తలు విని వారంతా ఆందోళన చెందుతున్నారు. టాలీవుడ్ లో నాగచైతన్య, సమంత విడిపోయినట్టుగా నిహారిక, చైతన్య జంట విడిపోతారా? అని అభిమానులు, నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.