Divi Vadhya : పుష్ప 2 లో బిగ్ బాస్ బ్యూటీ.. అలాంటి పాత్రలో..!

Divi Vadhya అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేసుకున్న ఈ సినిమా

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 08:04 PM IST

Divi Vadhya అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమా అంచనాలను తగినట్టుగా తెరకెక్కించడంలో సుకుమార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది.

సినిమాలో ఆమెది బోల్డ్ రోల్ అని చెబుతున్నారు. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన దివి అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది. ఐతే పుష్ప 2 తో ఆమెకు బ్రేక్ వస్తుందని భావిస్తుంది. పుష్ప 2 సినిమాలో దివి ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తుంది. సినిమాతో అమ్మడు ఏ రేంజ్ కి వెళ్తుంది అన్నది చూడాలి.

పుష్ప 2 సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఇస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా ఎప్పొడొచ్చినా సరే పుష్ప 1 క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసి పుష్ప 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అంటున్నారు.

Also Read : Nani Yellama : నాని ఎల్లమ్మ ఆగిపోవడం వెనుక కారణాలు అవేనా..?