తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ (Bharat Bhushan as The New President) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.దిల్ రాజు (Dil Raju) పదవి కాలం ముగియడంతో ..ఈ సారి పిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవిని పంపిణీ రంగం నుంచి ఇచ్చారు. దీంతో ఆదివారం ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి ఠాగూర్ మధు, భరత్ భూషణ్ బరిలో దిగారు. ఉపాధ్య్యక్ష పదవికి అశోక్‌కుమార్, వైవీఎస్ చౌదరి మధ్య పోటీ జరిగింది. దాదాపు 46 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా భరత్ భూషణ్, ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ గెలిచారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ , డిస్ర్టిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్ లోని 46 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా అధ్యక్ష బరిలో ఉన్న భరత్ భూషణ్‌కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్ష బరిలో ఉన్న అశోక్ కుమార్‌కు 28 ఓట్లు, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు వచ్చాయి. ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నికలు కూడా రాజకీయ ఎన్నికలను సైతం తలపించేలా కనిపిస్తున్నాయి. గతంలో మా ఎన్నికల విషయంలో కూడా ఇలాంటి పరిణామాలు చాలానే చూశాము. కానీ ఈసారి ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి పంపిణీ రంగానికి చెందిన వారిని పెంచుకోవడం జరిగింది.
Read Also : Nirmala Sitharaman : కర్నాటక జాతీయ సగటు కంటే అధిక ద్రవ్యోల్బణంతో బాధపడుతోంది