Site icon HashtagU Telugu

Yash: యశ్‌ అభిమానుల్లో నిరాశ… తర్వాతి ప్రాజెక్టుపై నో క్లారిటీ

Yash On His Next After Kgf There Will Be An Announcement By The End Of April 1

Yash On His Next After Kgf There Will Be An Announcement By The End Of April 1

Yash: కేజీఎఫ్ స్టార్ యష్ తర్వాతి సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ 2 విడదలై కూడా చాలా రోజులు అవుతుంది. కానీ ఇప్పటివరకు తర్వాతి ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొత్త సినిమాను ఇప్పటివరకు ప్రకటించలేదు. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా యశ్ ఎదిగాడు.

దీంతో యశ్ తర్వాతి ప్రాజెక్టు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. యశ్ తో సినిమా చూసేందుకు చాలామంది డైరెక్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఆచితూచి అడుగులు వేయాలని, మంచి స్టోరీ కూడా వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కేజీఎఫ్ తో యశ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఆ అంచనాలకు తగ్గట్లుగా మంచి కథను ఎంచుకునే పనిలో యశ్ ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

కేజీఎఫ్ తర్వాత ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ లలో యశ్ కనిపిస్తున్నాడు. దీంతో సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గతంలో కన్నడ డైరెక్టర్ నర్తన్ డైరెక్షన్ లో యశ్ తర్వాతి సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ యశ్ కు ఆయన చెప్పిన కథ నచ్చలేదని తెలుస్తోంది. దీంతో ఈ కథ స్క్రీఫ్ట్ దగ్గరే ఆగిపోయింది. అయితే ప్రశాంత్ నీల్ తో యశ్ మరో సినిమా ఉంటుందని టాక్ నడించింది. కానీ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్, జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమా చేసే పనిలో ఉన్నాడు. ఆ రెండు సినిమాలు పూర్తయ్యే సరికి మరో మూడేళ్లు పడుతుంది. దీంతో యశ్ తో సినిమా ఇప్పట్లో ఉండే అవకాశాలు లేవు.