Site icon HashtagU Telugu

Venkatesh : వెంకీ మామ కోసం ఆ దర్శకుడి నిరీక్షణ ఎన్నాళ్లు..?

Venkatesh Sankranthiki Vastunnaam Business Details

Venkatesh Sankranthiki Vastunnaam Business Details

Venkatesh విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమా రిజల్ట్ తర్వాత కథల విషయంలో ఫోకస్ గా ఉంటున్నాడు. వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపుడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎఫ్2, ఎఫ్3 సినిమాల తర్వాత వెంకటేష్, అనిల్ రావిపుడి చేస్తున సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఐతే అనిల్ తో సినిమా తర్వాత వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కి ఛాన్స్ ఇస్తాడని టాక్.

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడైన తరుణ్ భాస్కర్ తన సినిమాలతో యూత్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాడు. ఐతే వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా కొన్నేళ్లుగా డిస్కషన్స్ లో ఉంది. సినిమా చేస్తాం అంటున్నాడు కానీ తరుణ్ భాస్కర్ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోతున్నాడు.

వెంకటేష్ కోసం తరుణ్ భాస్కర్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ మిక్సెడ్ కథ ఒకటి రెడీగా ఉందట. ఐతే ఆ సినిమా సెకండ్ హాఫ్ ఇంకాస్త మెరుగుపరచాలనే ఉద్దేశంతో తరుణ్ భాస్కర్ ఆ ప్రాజెక్ట్ ని లేట్ చేస్తున్నాడు. వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా కన్ ఫర్మ్ అయితే మాత్రం సినిమాపై బజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. తప్పకుండా ఈ కాంబో సినిమా రావాలని ఆడియన్స్ కోరుతున్నారు.

Also Read : King Nagarjuna : కింగ్ నాగార్జున ఇది కరెక్ట్ టైం..!