వెంకటేష్ (Venkatesh ) మళ్లీ వరుస సినిమాల తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) అంటూ జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో F2 , F3 చిత్రాలు వచ్చి సక్సెస్ సాధించాయి. దీంతో ఇప్పుడు ఈ మూవీ తో వీరి కాంబో హ్యాట్రిక్ కొట్టబోతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే మరో సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
డైరెక్టర్ విమల్ కృష్ణ (DJ Tillu fame Vimal Krishna) కథకు వెంకీ ఓకే చెప్పినట్టు సమాచారం అందుతోంది. ‘డీజే టిల్లు’ చిత్రంతో విమల్ కృష్ణ సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ‘డీజే టిల్లు 2’కి మాత్రం ఆయన దూరంగా ఉన్నారు. అప్పటి నుంచీ ఓ కథ రెడీ చేసుకొని హీరోల చుట్టూ తిరుగుతున్నారు. చివరికి వెంకీ ఈ కథకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ‘టిల్లు’లా ఇది కూడా ఓ హిలేరియస్ ఎంటర్‌టైనర్ అని సమాచారం. 2025 ప్రారంభంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి ఏడాది చివర్లో విడుదల చేయాలనీ చూస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Read Also : RGV : వర్మకే ‘వణుకు’ పుట్టిస్తున్న బాబు..