Site icon HashtagU Telugu

Allu Arjun: దర్శకుడు VI ఆనంద్‌తో బన్నీ సినిమా అంటూ వార్తలు.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే?

Mixcollage 12 Feb 2024 05 03 Pm 9569

Mixcollage 12 Feb 2024 05 03 Pm 9569

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ డైరెక్టర్ VI ఆనంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆనంద్ తెలుగులో టైగర్,ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా వంటి సినిమాలను తెరకెక్కించి డైరెక్టర్గా మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నారు. తెలుగులో కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేయాలంటే VI ఆనంద్ ముందుంటారు లో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఇప్పుడు మరో సరికొత్త కథతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు డైరెక్టర్ ఆనంద్. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ కలిసి నటించిన ఊరుపేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

కాగా ఈ సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా దర్శకుడు VI ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలిపారు. ఇంటర్వ్యూలో ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ.. గతంలో VI ఆనంద్,అల్లు అర్జున్ కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. నిజంగానే సినిమా ఉందా అని డైరెక్టర్ ఆనంద్ స్పందిస్తూ.. అవును.. నేను బన్నీ గారితో సినిమా చేయాల్సి ఉంది. కొన్ని కథలను కూడా ఆయనకు వినిపించాను. ఒక సైఫై కథని కూడా వినిపించాను.

కానీ బన్నీ గారు ఇంకా కొంచెం పెద్ద కథ, ఆసక్తిగా ఉన్న కథ కావాలని అడిగారు. అప్పుడు నేను అలాంటి కథలు రాయలేదు. కానీ త్వరలో అల్లు అర్జున్ గారిని మళ్ళీ కలుస్తాను. ఆయనతో సినిమా భవిష్యత్తులో ఉండవచ్చు. ఊరుపేరు భైరవకోన తర్వాత గీత ఆర్ట్స్ లో నిఖిల్ తో ఒక సినిమా చేయబోతున్నాను అని తెలిపారు డైరెక్టర్ ఆనంద్. దీంతో అల్లు అర్జున్ తో ఆయన సినిమా చేయబోతున్న విషయం నిజమే కానీ అది ఇప్పట్లో ఉండబోదని ఫ్యూచర్ లో ఒకవేళ ఉంటే ఉండవచ్చు అని తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.