Site icon HashtagU Telugu

Vishwambhara: ఒక్క పోస్టుతో విశ్వంభర మూవీపై అంచనాలు పెంచిన డైరెక్టర్.. పోస్ట్ వైరల్!

Vishwambhara

Vishwambhara

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసింది. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ కూడా మొదలయ్యాయి. అయితే చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్‌ వశిష్ఠ. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

ఈ సినిమా సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో బీర్ ఫ్యాక్టరీ సెట్ వేసి ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ప్రస్తుతం విశ్వంభర హైదరాబాద్ ముచ్చింతల్ లో వేసిన సెట్ లో యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ ఓ భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు.

 

అయితే ఈ సెట్లో నిన్న పవన్ కళ్యాణ్, నాగబాబు విశ్వంభర సెట్స్ కి వెళ్లి చిరంజీవిని కలవగా ఆ ఆంజనేయస్వామి విగ్రహం ముందు ఫోటోలు దిగడంతో అవి వైరల్ గా మారాయి. ఇక ఇదే మంచి టైం అనుకున్నాడేమో డైరెక్టర్ వశిష్ట విశ్వంభర సినిమాపై అంచనాలు పెంచేలా ఒక పోస్ట్ చేసాడు.

Also Read Kiran Abbavaram: నా సినిమా నేను చూడలేక మధ్యలోనే బయటికి వచ్చాను : కిరణ్ అబ్బవరం

ఆంజనేయస్వామి విగ్రహం ముందు కత్తులు, ఆయుధాలు అన్ని గాల్లోకి ఎగరేసి భారీ యాక్షన్ ఉండబోతుంది అన్నట్టు ఒక ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ ఫోటోని డైరెక్టర్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ధర్మ యుద్ధం మొదలు!! విశ్వంభర విజృంభణం.. అని పోస్ట్ చేశాడు. దీంతో అక్కడ వచ్చే యాక్షన్ సీన్ భారీగా ఉంటుందని అర్థమైపోతుంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విశ్వంబర మూవీ పై అంచనాలు కాస్త మరింత పెరిగాయి.

Also Read: Tamannaah Bhatia: నా బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. అసలు విషయం లీక్ చేసిన తమన్నా?