Site icon HashtagU Telugu

Megastar : ఆ చిరంజీవిని చూపిస్తానంటున్న డైరెక్టర్.. మెగా ప్లానింగ్ అదుర్స్..!

Director Vasistha About Meg

Director Vasistha About Meg

Megastar బింబిసార సినిమాతో ఫస్ట్ ప్రాజెట్ తోనే సూపర్ అనిపించుకున్న డైరెక్టర్ వశిష్ట తన నెక్స్ట్ సినిమా ఏకంగా మెగాస్టార్ తో ఛాన్స్ అందుకున్నాడు. చిరంజీవి 157వ సినిమాగా వశిష్ట డైరెక్షన్ లో సినిమా వస్తుంది. ఈ సినిమా కథ ఒకప్పటి చిరంజీవిని గుర్తు చేస్తుందని అంటున్నారు డైరెక్టర్ వశిష్ట.

మెగాస్టార్ సినిమాలు చూసి పెరిగిన నాకు ఆయన్ను ఒక సూపర్ హీరోగా చూపించాలని ఉంది. అందుకే ఒక అద్భుతమైన ఫాంటసీ కథతో సినిమా చేస్తున్నామని అన్నారు.

Megastar చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అప్పట్లో ప్రభంజనాలు సృష్టించింది. ఆ సినిమా తర్వాత చిరుని అంతగా ఫాంటసీ సినిమాల్లో చూడలేదు. అందుకే ఈ తరం ప్రేక్షకులకు ఆ చిరంజీవిని చూపించాలని అనుకుంటున్నా అన్నారు వశిష్ట.

ఫాంటసీ సినిమాలు, కార్టూన్స్, చందమామ కథలు చదువుతూ పెరిగిన తాను ప్రస్తుతం మార్వెల్, డీసీ సూపర్ హీరోల స్టోరీలు, విఠలాచార్య సినిమాలను ఇష్టపడతాను.

బింబిసార కథ కూడా ఒకరోజు పాత మిక్కీ మౌస్ కార్టూన్ చూస్తున్న టైం లోనే ఆలోచన వచ్చిందని తెరపై కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో మేకర్స్ కు స్వేచ్చ ఉంటుందని అన్నారు వశిష్ట. గుర్రాలు, ఏనుగులు గాల్లో ఎగరడం లాంటి మ్యాజిక్ లు ఎన్నో యాడ్ చేయొచ్చు. మనం కూడా అవతార్ లా కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చు.

విజువల్ ఎఫెట్స్ కు ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా కోసం కొన్ని స్టూడియోస్ తో డిస్కషన్స్ చేస్తున్నామని గ్రాఫిక్స్ తో పాటుగా కథ, స్క్రీన్ ప్లే సినిమాకు బలమని తన అభిప్రాయమని అన్నారు వశిష్ట. నవంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. అనుష్క ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని తెలుస్తుంది.

Also Read : BiggBoss 7: మూడో పవర్ అస్త్ర ఎవరి సొంతం..?