Vishwambhara : ‘విజృంభణం’ అంటూ రిలీజ్ డేట్ ఫై క్లారిటీ

Vishwambhara : డైరెక్టర్ వశిష్ట తన ఎక్స్ అకౌంట్ ద్వారా విశ్వంభర విజృంభణం అంటూ ట్వీట్ చేసి జనవరి 10 డేట్ ని ప్రకటించి

Published By: HashtagU Telugu Desk
Vishwambhara Release Date

Vishwambhara Release Date

Vishwambhara Release Date : చిరంజీవి (Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిరు 156 మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). సోషియో ఫాంటసీ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ కాబోతుంది. ఎమ్ఎమ్ కీరవాణి సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. కాగా గత వారం రోజులుగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. మాములుగా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు తమ రిలీజ్ ను వాయిదా వేసుకుంటాయి. కానీ విశ్వంభర విషయంలో మాత్రం పోటాపోటీగా చిన్న , పెద్ద చిత్రాలన్నీ తమ రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తుండడం తో మెగా అభిమానుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

మొన్నటి వరకు సంక్రాంతి బరిలో (Sankranthi Race) బాలకృష్ణ (Balakrishna) , చిరంజీవి చిత్రాలు మాత్రం పోటీ పడబోతున్నాయని అంత అనుకున్నారు. కానీ ఇప్పుడు బాలకృష్ణ తో పాటు వెంకటేష్ – అనిల్ రావిపూడి, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ / విదముయార్చి , సందీప్ కిషన్ – త్రినాధరావు నక్కిన కాంబో మూవీ సైతం పండక్కు రాబోతున్నాయని తెలుస్తుంది. ఇన్ని సినిమాలు ఒకే టైములో వస్తే కలెక్షన్ల తో పాటు థియేటర్స్ దొరకడం కూడా ఇబ్బందే. ఇదే తరుణంలో చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ సైతం జనవరి 25 కు ఆలా వస్తుందనే టాక్ నడుస్తుంది. దీంతో ఇన్ని సినిమాలు వస్తున్నాయంటే..విశ్వంభర ఏమైనా వాయిదా పడబోతుందా..? అందుకే వీరంతా పోటీకి సిద్దమయ్యారా..? అని మెగా అభిమానులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
భారీ సిజి వర్క్ తో పాటు గేమ్ ఛేంజర్ కు దీనికి కేవలం ఇరవై రోజుల గ్యాప్ మాత్రమే ఉండటం వల్ల పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటూ ఫిలిం నగర్ వర్గాల్లో సైతం చర్చ మొదలైంది. సోషల్ మీడియా లో ఇదే చర్చ ఎక్కువగా నడుస్తుండడం తో డైరెక్టర్ వశిష్ట తన ఎక్స్ అకౌంట్ ద్వారా విశ్వంభర విజృంభణం అంటూ ట్వీట్ చేసి జనవరి 10 డేట్ ని ప్రకటించి..రిలీజ్ విషయంలో తగ్గేదేలే అని క్లారిటీ ఇచ్చారు. సో సంక్రాంతి బరిలో విశ్వంభర పక్క అన్నమాట.

  Last Updated: 19 Sep 2024, 01:31 PM IST