Director Teja: అది నేను కనిపెట్టాకే అందరూ ఉపయోగిస్తున్నారు.. ఆసక్తికర వాఖ్యలు చేసిన తేజ!

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 12:00 PM IST

టాలీవుడ్ దర్శకుడు తేజ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో చిత్రం, జయం, నువ్వు నేను లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు తేజ. మొదట అసిస్టెంట్ కెమెరామెన్ గా కెరీర్ మొదలుపెట్టి సినిమాటోగ్రాఫర్ గా చాలా సూపర్ హిట్ సినిమాలకు పనిచేసి చిత్రం సినిమాతో దర్శకుడిగా మారారు. కెరీర్ మొదట్నుంచి కూడా కొత్త వాళ్ళతో, చిన్న హీరోలతో సినిమాలు తీస్తూ సక్సెస్ లు కొట్టాడు. మధ్యలో కొన్ని సినిమాలు పరాజయం పాలవడంతో ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. అయితే డైరెక్టర్ తేజ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా ఇంటర్వ్యూల ద్వారా బాగా హైలైట్ అయ్యారని చెప్పవచ్చు..

ఇంటర్వ్యూలో పాల్గొంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఏదైనా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కాగా ప్రస్తుతం తేజ రానాతో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక తన సినిమాలతోనే కాక తన గురువు ఆర్జీవిలాగా మాట్లాడే మాటలతో కూడా వైరల్ అవుతూ ఉంటాడు తేజ. ఇకపోతే సాధారణంగా సినిమాల్లో షూట్ మొదలు పెట్టేముందు క్లాప్ బోర్డు కొడతారు. గతంలో చెక్క బోర్డులు వాడి, దానిపై చాక్ పేస్ తో సీన్ నెంబర్, డేట్, షాట్ నంబర్, సీన్ టైమింగ్ ఇలా పలు విషయాలు రాస్తారు. ప్రస్తుతం మాత్రం ఆ చెక్క బోర్డులు, చాక్ పీస్ లు పోయి అక్రెలిక్ బోర్డ్స్, మార్కర్స్ వచ్చాయి. అవి మొదలుపెట్టింది నేనే అని తేజ తెలిపాడు. ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ..

గతంలో నేను కెమెరామెన్ గా ఉన్నప్పుడు చెక్క బోర్డు మీద చాక్ పీస్ తో రాసి క్లాప్ కొట్టేవాళ్ళు దాని వల్ల ఆర్టిస్ట్ ఫేస్ ముందు ఆ చాక్ పౌడర్ లైట్ గా కనిపించేది. అందుకే నేను దర్శకుడిగా మారాక మొదటి సినిమా చిత్రంకు ఆక్రలిక్ బోర్డు తయారు చేయించాను. దానిపై మార్కర్ తో రాసి క్లాప్ కొట్టించేవాడిని. దాని వల్ల ఆ డస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. సినీ పరిశ్రమలో నేనే అది మొదటిసారి వాడాను. ఆ తర్వాత అందరూ అవే వాడారు. కృష్ణ నగర్ లో ఒకడికి ఆ అక్రలిక్ బోర్డ్స్ చేయడం నేనే నేర్పించాను అని తెలిపారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమలో సినిమా మొత్తం డిజిటల్ లో మొదటిసారి చేసింది నేనే. నీకు నాకు డాష్ డాష్ సినిమాని మొదటిసారి రెడ్ కెమెరా వాడి రీల్స్ లేకుండా మొత్తం డిజిటల్ లోనే తీశాను. ఇప్పుడు అందరూ డిజిటల్ లోనే సినిమాలు తీస్తున్నారు. ఇలా సినీ పరిశ్రమలో చాలా కొత్తవి తీసుకొచ్చాను అని తెలిపారు. ఇంత ట్యాలెంటెడ్, ఒకప్పుడు స్టార్ డైరెక్టర్, ఇప్పుడేమో హిట్స్ లేక, మంచి సినిమాలు తీయక ఇలా ఉన్నాడు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.