Sukumar: రంగస్థలంలో ఫస్ట్ ఛాయస్ సమంత కాదు.. అసలు విషయం బయట పెట్టిన సుకుమార్!

  • Written By:
  • Publish Date - April 9, 2024 / 05:51 PM IST

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో డైరెక్టర్ సుకుమార్ పేరు కూడా ఒకటి. సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీని రూపొందిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు సుకుమార్. అల్లు అర్జున్ ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు సుకుమార్. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు సుకుమార్. ఈ క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join
ఇక సుకుమార్ సినిమాల్లో రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సమంత డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. ఇందులో రామ్ చరణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. రామలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది సామ్. పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయి నటించింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కు ఎంత పేరు వచ్చిందో, హీరోయిన్ సమంతకు కూడా అంతే పేరు వచ్చింది. అయితే సమంత నటన చూసి సుకుమార్ షాక్ అయ్యాడట. సమంత తప్పా ఆ పాత్రలో మరెవ్వరూ నటించలేరు అనేలా నటించింది సామ్. అయితే రంగస్థలం సినిమాలో సమంత నటన గురించి సుకుమార్ మాట్లాడుతూ..

Also Read: Jr Ntr: ఆ యాక్సిడెంట్ తర్వాత నేను బతికింది దానికోసమే: ఎన్టీఆర్

రంగస్థలం సినిమాలో రామ్‌ చరణ్‌ అద్భుతంగా నటించి మెప్పించాడు. రంగస్థలం సినిమా కథను రాసుకున్నా.. కానీ సమంత చేసిన రామలక్ష్మీ పాత్రను మాత్రం ఆమె కోసం రాయలేదు. అందుకోసం ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకున్నాము. సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు స్టార్స్‌ అయితే మేనేజ్‌ చేయలేనేమో అనుకున్నా సినిమా కథకు తగ్గట్టుగా తెలుగు వచ్చిన ఒక అమ్మాయిని తీసుకోవాలనుకున్నాము. కానీ సమంత అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని సామ్‌ను సెకల్ట్ చేశాం అని తెలిపారు సుకుమార్. సామ్ నటన చూసి షాక్ అయ్యాను. అద్భుతంగా నటించి మెప్పించింది. నేను సినిమాలు చేసినంత కాలం సామ్ తో చేస్తా అని తెలిపారు సుకుమార్.

Also Read; Sunny Leone: పెళ్ళికి ముందే నన్ను మోసం చేశాడు.. మాజీ ప్రియుడి గురించి సంచలన వాఖ్యలు చేసిన సన్నిలియోన్?