ఆకాశం నీ హద్దురా దర్శకురాలు సుధా కొంగర (Director Sudha Kongara) తీవ్ర గాయాలపాలైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయిన ఫోటోను షేర్ చేసింది. చాలా బాధగా ఉంది. ఎంతో చిరాకుగా ఉంది. నెల రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్ తప్పదు అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా గాయానికి గల కారణాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.
Also Read: Road Accident : ద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీ కొట్టిన స్కూల్ ఆటో
సుధా కొంగర దర్శకత్వం వహించి, సూర్య నటించిన, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం సూరిరై పొట్టు నేరుగా 2020లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. తమిళంలో మంచి విజయం సాధించిన తర్వాత సుధా కొంగర హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. సూర్య కో-ప్రొడ్యూసర్‌గా చేరాడు.
ఈ చిత్రానికి సంబంధించిన సంగీతాన్ని ఇటీవలే ప్రారంభించినట్లు జి.వి.ప్రకాష్ వెల్లడించారు. ఈ క్రమంలో దర్శకురాలు సుధా కొంగర షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన చేతితో తన ట్విట్టర్, ఇన్స్టా పేజీలో పోస్ట్ చేశారు. బాధాకరం. మరో నెల రోజులు షూటింగ్ లేదు అంటూ పోస్ట్ పెట్టారు. ఇది నాకు అనవసరమైన విరామం అని కూడా పోస్ట్ చేశారు.