Site icon HashtagU Telugu

Shankar: అతన్ని రెండవ వివాహం చేసుకోబోతున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. ఘనంగా నిశ్చితార్థం?

Mixcollage 19 Feb 2024 08 45 Am 6266

Mixcollage 19 Feb 2024 08 45 Am 6266

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య రెండవ వివాహం చేసుకోబోతోంది. ఇదే విషయాన్ని ఐశ్వర్య చౌదరి అతిథి శంకర్ సోషల్ మీడియా తెలిపింది. అయితే ఇప్పటికే గతంలో ఆమెకు పెళ్లి అయిన విషయం తెలిసిందే. కాగా డైరెక్టర్‌ శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐశ్వర్యా శంకర్ డాక్టర్‌ గా కొనసాగుతుంటే, రెండో కూతురు ఐశ్వర్య మాత్రం తండ్రి అడుగుజాడల్లో నడుస్తోంది. హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తోంది అదితీ శంకర్.

ఐశ్వర్యకు 2021లో ప్రముఖ క్రికెటర్‌ రోహిత్ దామోదర్‌ తో వివాహమైంది. మహాబలిపురంలో ఎంతో ఘనంగా వీరిద్దరి వివాహం జరిగింది. అయితే విభేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. భర్తతో విడిపోయిన ఐశ్వర్య తన తండ్రి శంకర్‌ తోనే ఉంటోంది. ఇప్పుడు రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగపెట్టనుంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్‌తో తాజాగా నిశ్చితార్థం జరిగింది. తరుణ్ కార్తికేయన్ కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు. పాటల రచయిత, నేపథ్య గాయకుడు కూడా. త్వరలోనే ఐశ్వర్య, తరుణ్‌ల పెళ్లి తేదీని ప్రకటించనున్నారు శంకర్‌ కుటుంబ సభ్యులు.

తాజాగా ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజెన్లు త్వరలో ఒకటి కాబోతున్న జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఇకపోతే శంకర్ విషయానికి వస్తే శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Exit mobile version