Site icon HashtagU Telugu

Shankar : ఇండియన్ 2 డిజాస్టర్ అయినా ఇండియన్ 3 పనులు మొదలుపెట్టిన శంకర్.. ఆరు నెలల్లో..

Director Shankar Starts Kamal Haasan Indian 3 Movie Works

Shankar Kamal Haasan

Shankar : ఒకప్పటి గ్రేట్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు తడబడుతున్నాడు. స్నేహితుడు సినిమా నుంచి అతని సినిమాలకు డివైడ్ టాక్ వస్తూనే ఉంది. సూపర్ హిట్ ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2(Indian 2) తీసుకొస్తే అది కాస్తా డిజాస్టర్ అయింది. ఇక రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా తీస్తే అది కూడా డివైడ్ టాక్ వచ్చింది.

ఇండియన్ 2 సినిమాకు సీక్వెల్ ఇండియన్ 3 కూడా ఉందని గతంలోనే చెప్పారు. ఆల్రెడీ చాలా భాగం షూటింగ్ కూడా పూర్తయింది. దీంతో గేమ్ ఛేంజర్ అయిపోవడంతో త్వరలో ఇండియన్ 3 పనులు మొదలుపెడతారని అన్నారు శంకర్.

తాజాగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ.. ఇండియన్ 3 సినిమాకు సంబంధించి ఇంకా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలి. అది పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి ఆరు నెలల్లో ఈ సినిమాని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అని తెలిపారు. అసలే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలు తెచ్చుకున్న శంకర్ ని చూసి ఇండియన్ 3 సినిమాకు ఏ రేంజ్ స్పందన వస్తుందో చూడాలి.

ఇండియన్ 3 సినిమా తర్వాత మధురై ఎంపీ వెంకటేశన్ రాసిన వేల్పరి అనే నవల ఆధారంగా శంకర్ సినిమా తీయబోతున్నట్టు సమాచారం.

Also Read : Chiranjeevi : గేమ్ ఛేంజర్ నెగిటివిటీపై మాట్లాడిన తమన్.. డియర్ తమన్ అంటూ స్పందించిన చిరంజీవి..