Director Shankar : దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కిన భారీ సినిమా గేమ్ ఛేంజర్(Game Changer). జనవరి 10న రిలీజయిన ఈ సినిమాకు మొదట డివైడ్ టాక్ వచ్చినా సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఈ సినిమా మొదటి రోజే 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ సినిమా విషయంలో శంకర్ పైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. అవసరం లేకపోయినా చాలా చోట్ల భారీగా కనిపించడానికి కోట్లు ఖర్చుపెట్టి డబ్బులు వేస్ట్ చేసి బడ్జెట్ ని పెంచేసాడని, ముఖ్యంగా సాంగ్స్ కి 75 కోట్లు అవసరం లేకపోయినా ఖర్చుపెట్టాడని ఫ్యాన్స్, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
అయితే తాజాగా ఓ తమిళ మీడియాతో డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమా ఫైనల్ అవుట్ పుట్ తో నేను సంతోషంగా లేను. నేను అనుకున్న దాని ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమా నిడివి 5 గంటలు. కానీ సమయాభావం వల్ల చాలా సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది. దీంతో అనుకున్న విధంగా అవుట్ పుట్ రాలేదు అని అన్నారు. అలాగే సినిమాపై వస్తున్న స్పందన గురించి మాట్లాడుతూ.. ఆన్లైన్ లో నేను చూస్తున్నాను గేమ్ ఛేంజర్ సినిమాకు మంచి రివ్యూలే వస్తున్నాయి అని అన్నారు.
Also Read : Anil Ravipudi : అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ డైరెక్టర్ శంకర్ మీదేనా? భారీ బడ్జెట్స్ పై..