Site icon HashtagU Telugu

Nani : రక్తం కారుతున్నా, జుట్టు కాలిపోయినా సినిమా షూటింగ్ చేసిన నాని.. డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Director Sailesh Kolanu Tells about Nani Dedication to Cinema While Hit 3 Movie Shooting

Nani

Nani : ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు నాని. నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా మే 1 న రిలీజ్ కానుంది. తాజాగా నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరగ్గా రాజమౌళి గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ సినిమా షూటింగ్ లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి తెలిపారు.

శైలేష్ కొలను మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక ఫైట్ సీన్ చేస్తుండగా ఫైర్ వచ్చి నాని నెత్తి మీద పడి ఒక పక్క హెయిర్ కాలిపోయింది. దాంతో ఆ రోజు షూట్ కి ప్యాకప్ చెపుదాం అనుకున్నా. కానీ నాని వెంటనే కారవాన్ కి వెళ్లి జుట్టు సరిచేసుకొని వచ్చి షూట్ కి రెడీ అన్నారు.

అదే రోజు ఇంకో షాట్ చేస్తుంటే కెమెరా తలకు తగిలి చీలి రక్తం కారింది. అప్పుడు కూడా ఇంకా ఎన్ని షాట్స్ ఉన్నాయి అని అడిగి రక్తం గడ్డ కట్టేలా చేసి షూటింగ్ పూర్తి చేసాడు. షూటింగ్ శ్రీనగర్ దగ్గర లో జరుగుతుంది. షూట్ అవ్వగానే ఢిల్లీకి నైట్ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని ఉదయాన్నే మళ్ళీ శ్రీనగర్ వచ్చి అక్కడ్నుంచి షూటింగ్ లొకేషన్ కి మూడు గంటలు ప్రయాణం చేసి వచ్చాడు. సినిమా పట్ల ఆయనకు అంత పిచ్చి ఉంది అని తెలిపాడు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు నాని సినిమా పట్ల చూపిస్తున్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

Also Read : Salman Khan : సల్మాన్ మళ్ళీ హిట్ కొట్టాలంటే రాజమౌళి తండ్రి రావాల్సిందే.. ఆ సినిమా సీక్వెల్ పై క్లారిటీ..