Site icon HashtagU Telugu

RGV Tweet KrishnamRaju Death: రెండు రోజులు షూటింగ్ ఆపేద్దాం.. పెద్దమనిషికి గౌరవం ఇద్దాం!

Rgv

Rgv

రామ్ గోపాల్ వర్మ కృష్ణంరాజుకు గౌరవ సూచకంగా షూటింగ్‌లను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. కృష్ణంరాజు అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ప్రముఖ నటుడు కృష్ణంరాజుకు గౌరవ సూచకంగా చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తదితరులను రెండు రోజుల పాటు షూటింగ్ ఆపేయాలని వర్మ కోరారు.

“మన మరణానికి విలువనిస్తే కృష్ణంరాజు లాంటి పెద్దమనిషికి గౌరవం చూపుదాం. ప్రొడక్షన్ కాస్ట్ ఎలా తగ్గించుకోవాలా అని నెల రోజులుగా షూటింగ్ ఆపేసిన ఇండస్ట్రీ మాది. మీ హృదయాలు అంగీకరించకపోయినా చేద్దాం’’ అని ట్వీట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ ఎందుకు సెంటిమెంట్ అయ్యాడు? వర్మ ఇప్పటి వరకు కృష్ణంరాజుతోకానీ, ప్రభాస్‌తో కానీ కలిసి పని చేయలేదు. ప్రస్తుతం వర్మ ట్వీట్ టాలీవుడ్ లో ఆసక్తిగా మారింది.