Site icon HashtagU Telugu

Rajamouli: మహేష్ మూవీకి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాజమౌళి.. కారణం అదే!

Mixcollage 17 Mar 2024 03 29 Pm 3859

Mixcollage 17 Mar 2024 03 29 Pm 3859

తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి ఒకదాని తర్వాత ఒకటి సినిమాలను విడుదల చేస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలచడంతో పాటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇకపోతే జక్కన్న చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రాజమౌళి క్రేజ్ మరింత పెరిగింది.

మరి అలాంటి రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే నేషనల్ వైడ్ ట్రెండింగ్ గా మారుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి సినిమా చేస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్లను సైతం రంగంలోకి దింపుతున్నారట జక్కన్న. SSMB 29 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధికంగా ఏకంగా రూ.1000 కోట్లతో రాజమౌళి- మహేశ్ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

అదే సమయంలో నటీనటులు రెమ్యునరేషన్లపై కూడా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమా కోసం రాజమౌళి తీసుకునే పారితోషకంపై కూడా ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న SSMB 29 కోసం జక్కన్న ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోట్లేదని సమాచారం. దీనికి బదులుగా ఆయన వేరొక మార్గాన్ని ఎంచుకున్నారట. అదేంటంటే ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్‌కి బదులుగా సినిమా లాభాల్లో వాటా తీసుకోనున్నారట. సాధారణంగా సినిమాకు థియేటర్, ఓటీటీ, శాటిలైట్స్ రైట్స్ అంటూ కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఇక హిట్ టాక్ వస్తే కోట్లు కురుస్తాయి. అందుకే SSMB 29 లో నటించే ప్రధాన నటీనటుల పారితోషికం కంటే ఎక్కువగానే రాబట్టుకునేలా ప్లాన్ చేశారట జక్కన్న. తద్వారా రెమ్యునరేషన్ తో కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయబోతున్నారట. రాజమౌళితో పాటు మహేశ్ కూడా రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో వాటా తీసుకునేందుకు రెడీ అయ్యారట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ మీడియా సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. SSMB సినిమాలో మహేశ్‌ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది.

Exit mobile version