Site icon HashtagU Telugu

Charan – Arjun : రామ్ చరణ్ చేయాల్సిన సినిమా.. అల్లు అర్జున్ చేశాడు.. అదేంటో తెలుసా..?

Director Raghavendra rao wants to do movie with Ram Charan but Chiranjeevi said no and Suggests Allu Arjun

Director Raghavendra rao wants to do movie with Ram Charan but Chiranjeevi said no and Suggests Allu Arjun

ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu Arjun) ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా వెలుగుతున్నారు. పుష్ప(Pushpa) సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌డమ్ ని సంపాదించుకుంటే, RRR తో చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అయితే వీరి కెరీర్ మొదటిలో రామ్ చరణ్ చేయాల్సిన ఒక మూవీని అల్లు అర్జున్ చేసి హిట్ కొట్టాడు.

అల్లు అర్జున్ 2003లో ‘గంగోత్రి'(Gangothri) సినిమాతో హీరోగా ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమాని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా నిజానికి రామ్ చరణ్ చేయాల్సింది. రాఘవేంద్రరావు, అశ్వినీ దత్ కొత్త నటీనటులతో ఒక సినిమా చేద్దామని ఒక స్టోరీ సిద్ధం చేసుకున్నప్పుడు.. ఆ కథతో చరణ్ ని లాంచ్ చేయాలని అశ్వినీ దత్ భావించాడు. అందుకోసం చిరంజీవిని కలిసి కథ కూడా వినిపించారట.

అయితే రామ్ చరణ్ కి అప్పటికి నటన పై ఇంకా పట్టు లేకపోవడంతో చిరంజీవి వద్దు అని చెప్పాడట. ఆ కథని అల్లు అర్జున్ తో తీయండి బాగుంటుంది అని చిరు చెప్పడంతో.. గంగోత్రి సినిమా అల్లు అర్జున్ కి వచ్చింది. ఇక అక్కడ మొదలైన బన్నీ కెరీర్ నేడు నేషనల్ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగింది. ఇక రామ్ చరణ్ ని గంగోత్రితో లాంచ్ చేయలేకపోయిన అశ్వినీ దత్.. ‘చిరుత’ సినిమాతో ఆడియన్స్ కి పరిచయం చేశాడు.

అల్లు అర్జున్, రామ్ చరణ్ మాస్ హీరోలుగా ఎదిగిన తరువాత ఇద్దరు ఒక సినిమాలో కనపడినా కలిసి నటించలేదు. రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ‘ఎవడు’ మూవీలో అల్లు అర్జున్ కొంతసమయం కనిపించి మెగా ఆడియన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. ఆ తరువాత మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించలేదు. అయితే అల్లు అరవింద్ మాత్రం.. వీరిద్దరితో ఒక మల్టీస్టారర్ చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. మరి అది ఎప్పుడవుతుందో చూడాలి.

 

Also Read : Mark Antony : హమ్మయ్య కోర్టులో సినిమాకు క్లియరెన్స్ తెచ్చుకున్న విశాల్.. మార్క్ ఆంటోనీ రిలీజ్..