Site icon HashtagU Telugu

Vaishnavi Chaitanya : ఇస్మార్ట్ కు జోడిగా బేబీ.. ఇక.‘డబుల్ ఇస్మార్టే’

director puri jagannadh chance to vaishnavi

director puri jagannadh chance to vaishnavi

వైష్ణవి ..ఇప్పుడు ఈపేరు యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది..కళ్లు మూసుకున్న వైష్ణవే..కళ్లు తెరచిన వైష్ణవే. అంతలా అమ్మడు కట్టిపడేసింది. రీల్స్ చేస్తూ సోషల్ మీడియా లో పాపులరైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి మరింత ఆకట్టుకుంది. ఇదే క్రమంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌‌లో వచ్చిన ‘అల వైకుంఠపుములో’ సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. దాని తర్వాత సాఫ్ట్‌‌‌వేర్ డెవలపర్ – వెబ్ సరీస్ చేసింది. ఆ సిరీస్ సూపర్ హిట్ కావడం తో హృదయ కాలేయం ఫేమ్ సాయి రాజేష్ అమ్మడికి బేబీ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా లో వైష్ణవి నటన గురించి ఎంత చెప్పిన తక్కువే. మెగాస్టార్ చిరంజీవి సైతం వైష్ణవి (Vaishnavi) ని సహజ నటి జయసుధ తో పోల్చారంటే అర్ధం చేసుకోవాలి అమ్మడు ఎంతగా ఆకట్టుందో.

ప్రస్తుతం వైష్ణవి కి వరుస ఆఫర్లు తలుపుతడుతున్నాయి. చిన్న డైరెక్టర్స్ దగ్గరి నుండి పెద్ద డైరెక్టర్స్ వరకు అమ్మడినే హీరోయిన్ గా పెట్టుకోవాలని అడుగుతున్నారట. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి (Puri Jagannath)..వైష్ణవి కి ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడని సమాచారం. లైగర్ తో భారీ డిజాస్టర్ అందుకున్న పూరి..ఇప్పుడు హీరో రామ్ (Ram Pothineni) తో డబుల్ ఇస్మార్ట్ అనే మూవీ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ (Double Smart) తెరకెక్కుతుంది. ఈ మూవీ లో సెకండ్ హీరోయిన్ గా వైష్ణవి ని అనుకుంటున్నారట.ఇక పూరి చేతిలో పడితే ఏ హీరోయిన్ అయిన స్టార్ హీరోయిన్ అవ్వాల్సిందే. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా హిట్ అయితే వైష్ణవి పెద్ద స్టార్ అవ్వడం గ్యారంటీ అని అప్పుడే ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి వైష్ణవి ని డబుల్ ఇస్మార్ట్ లో ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.

Read Also : meenakshi chaudhary : పింక్ శారీ లో ముగ్ద మనోహరంగా కనిపిస్తున్న మీనాక్షి