Site icon HashtagU Telugu

Prashanth Varma : హనుమాన్ సినిమాపై, మా టీంపై నెగిటివ్ ప్రమోషన్స్ చేస్తున్నారు.. డైరెక్టర్ సంచలన ట్వీట్..

Director Prashanth Varma Sensational Tweet on Negitive Posts about Hanuman and his Team

Director Prashanth Varma Sensational Tweet on Negitive Posts about Hanuman and his Team

ఈ సంక్రాంతికి(Sankranthi) వచ్చిన సినిమాల్లో హనుమాన్(Hanuman) ఒకటి. ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా హనుమంతుడిని ఆధారంగా తీసుకొని ఓ సూపర్ హీరో సినిమాలా హనుమాన్ ని తెరకెక్కించారు. మూడేళ్ళుగా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన హనుమాన్ సినిమా ముందు నుంచి కూడా సమస్యలను చూస్తుంది. సినిమా తీసేటప్పుడు బడ్జెట్, ఆర్టిస్టులకు గాయాలు.. లాంటి సమస్యలు రాగా, రిలీజ్ కి ముందు థియేటర్స్ సమస్య వచ్చింది.

గత వారం రోజులుగా హనుమాన్ థియేటర్స్ సమస్య రెండు రాష్ట్రాల్లోనూ వైరల్ అవుతూనే ఉంది. దిల్ రాజు తన గుంటూరు కారం సినిమాకు ఆల్మోస్ట్ 90 శాతం థియేటర్లు ఇచ్చేసుకొని హనుమాన్ కి థియేటర్లు దొరక్కుండా చేసాడని వార్తలు వచ్చాయి. దీంతో హనుమాన్ తక్కువ థియేటర్స్ లోనే రిలీజయింది. ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేయడంతో హనుమాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక్కడే కాకుండా నార్త్ లో కూడా హనుమాన్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా అదరగొడుతుంది హనుమాన్ సినిమా.

అయితే రిలీజ్ అయ్యాక కూడా కొంతమంది హనుమాన్ సినిమాకి ఇబ్బందులు సృష్టిస్తున్నారు. హనుమాన్ టికెట్లు దొరకట్లేదు, థియేటర్లు కావాలంటున్న గుంటూరు కారం సినిమాకు తక్కువ మంది ఉన్నా థియేటర్స్ ఇవ్వట్లేదు. అంతే కాక హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొని మహేష్ గుంటూరు కారం సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో కొంతమంది మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ తో హనుమాన్ పై, చిత్రయూనిట్ పై నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. గత రెండు రోజులుగా హనుమాన్ పై ఫేక్ న్యూస్, నెగిటివ్ పోస్టులు రాస్తుండటంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నేడు తన ట్విట్టర్ లో దీనిపై సీరియస్ గా స్పందించాడు.

ప్రశాంత్ వర్మ తన ట్వీట్ లో.. సోషల్ మీడియాలో చాలా మంది ఫేక్ ప్రొఫైల్స్ తో మా సినిమా మీద, మా టీం మీద నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. నిన్న భోగి రోజు ఇలాంటి డిజిటల్ చెత్తని మంటల్లో వేయడం మర్చిపోయినట్టు ఉన్నారు. ఏది ఏమైనా ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికైనా గెలుస్తాడు అని మా నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రేక్షకులు హనుమాన్ సినిమాకి సపోర్ట్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు. హనుమాన్ ఈ సంక్రాంతి నుంచి ఇంకా ఎత్తుకు ఎదగడానికి సిద్ధంగా ఉంది అని పోస్ట్ చేశాడు. దీంతో ప్రశాంత్ వర్మ ట్వీట్ టాలీవుడ్ లో చర్చగా మారింది.

 

Also Read : Mega Family : మెగా సంక్రాంతి.. మెగా ఫ్యామిలీ అంతా బెంగుళూరులో సందడి..