Prashanth Neel :గొప్పమనసు చాటుకున్న దర్శకుడు…సొంత గ్రామానికి భారీ విరాళం…మాజీ మంత్రి రఘవీరారెడ్డి భావోద్వేగం..!!

KGF సినిమాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్...ఆయన పేరుతో దేశమంతా మారుమోగింది. బాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా ప్రశాంత్ నీల్ షేక్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Prashanth Neel

Prashanth Neel

KGF సినిమాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్…ఆయన పేరుతో దేశమంతా మారుమోగింది. బాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా ప్రశాంత్ నీల్ షేక్ చేశారు. ప్రశాంత్ నీల్ ఎవరో కాదు…మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం గ్రామం వీరిది.

కాగా తన గ్రామానికి ప్రశాంత్ నీల్ భారీ విరాళాన్ని అందించారు. నీలకంఠాపురంలోని నిర్మిస్తున్న LV ప్రసాద్ కంటి ఆసుపత్రికి రూ. 50లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆ గ్రామస్తులందరికీ ఇది ఎంతో గర్వించే సందర్భమని ట్వీట్ చేశారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి 75 జన్మదినాన్ని పురస్కరించుకుని విరాళాన్ని అందించినట్లు చెప్పారు. సరిగ్గా మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజే సుభాష్ రెడ్డి జన్మించినట్లు చెప్పారు.

ఇక తన తండ్రి జయంతి ఆగస్టు 15 సందర్భంగా ప్రశాంత్ నీల్ కుటుంబ సమేతంగా నీలకంఠాపురానికి వచ్చారు. అక్కడ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయాలను సందర్శించారు.

  Last Updated: 16 Aug 2022, 01:30 PM IST