Site icon HashtagU Telugu

NTR -Neel : 2 వేల మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన డైరెక్టర్

Ntr Movie Shooting

Ntr Movie Shooting

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (NTR -Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ మధ్య ఎంతటి క్రేజ్ ఉన్నదో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో జరుగుతోంది. ఇటీవల కర్ణాటకలో చిన్న షెడ్యూల్ పూర్తయిన తరువాత, ఇప్పుడు హైదరాబాద్‌లో మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సీన్‌లో ఎన్టీఆర్‌తో పాటు 2,000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనడం విశేషం.

Shobha Karandlaje: సిద్ధరామయ్య రాజీనామా చేయాలి.. డీకే శివకుమార్‌ను అరెస్ట్‌ చేయాలి :

ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం (స్పెషల్ సాంగ్) ఉండబోతోందని సమాచారం. తొలుత నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేరు వినిపించినా, ఇప్పుడు తాజా రూమర్స్ ప్రకారం ‘సింగిల్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మను తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కేతికకు ఇది గోల్డెన్ ఛాన్స్ అవుతుందని సినీప్రేమికులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌ గ్లింప్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూసినా, అదే రోజున ‘వార్ 2’ టీజర్ విడుదల కావడంతో, ఈ ప్రాజెక్ట్‌ గ్లింప్స్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

World Environment Day : వనమహోత్సవం ప్రారంభించిన సీఎం చంద్రబాబు..పర్యావరణ పరిరక్షణపై మద్దతు

ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్ సరసన ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అయితే టైటిల్ విషయంలో ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. ‘డ్రాగన్’ అనే పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ, అదే పేరుతో ఒక తమిళ చిత్రం ఇటీవల విడుదల కావడంతో టైటిల్ మారే అవకాశం ఉందని టాక్. “రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” పేరుతో డబ్ చేయడం, లీగల్ ఇష్యూలు ఉన్నాయని గాసిప్స్ వెలువడుతున్నాయి. కానీ అధికారికంగా ఏదీ వెల్లడించలేదు. త్వరలో టైటిల్, గ్లింప్స్‌పై స్పష్టత రావచ్చని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.