Director Nag Ashwin : కల్కి డైరెక్టర్ మారుతీ 800 లో తిరగడం ఏంటి ..?

Director Nag Ashwin : నాగ్ అశ్విన్ (Director Nag Ashwin) మారుతీ 800 (Maruthi 800)లలో రోడ్ల పై తిరగడం అందర్నీ ఆశ్చర్యం వేస్తుంది

Published By: HashtagU Telugu Desk
Nag Car

Nag Car

ఈరోజుల్లో యూట్యూబ్ లో కాస్త ఫేమస్ అయినవారే బెంజ్ కార్లలో తిరుగుతుంటే..కల్కి (kalki) వంటి పాన్ ఇండియా సినిమా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ (Director Nag Ashwin) మారుతీ 800 (Maruthi 800)లలో రోడ్ల పై తిరగడం అందర్నీ ఆశ్చర్యం వేస్తుంది. నాగ్ అశ్విన్ ఈ సింపుల్ జీతాన్ని చూసి ఫ్యాన్స్ ఆయన నేల చాటుతనం ప్రశంసిస్తున్నారు.

Cooking Oil: వాడిని నూనెను మళ్ళీ మళ్ళీఉపయోగిస్తున్నారా.. అయితే ఇది ఎంత డేంజర్ లో తెలుసా?

హైదరాబాద్ రోడ్లపై నాగ్ అశ్విన్ స్వయంగా డ్రైవ్ చేస్తూ కనిపించిన మారుతీ 800 కారు జాతిరత్నాలు సినిమాలో వాడినదే అని తెలుస్తోంది. ఆ సినిమాకు కూడా ఆయన దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఈ సీన్‌ను ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయింది. డైరెక్టర్ హోదాలో ఉన్నప్పటికీ నాగ్ అశ్విన్ ఇలా సాధారణ వాహనంలో తిరగడం ఆయనలో ఉన్న వినమ్రతకు నిదర్శనం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి 2 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించిన కల్కి మొదటి భాగం భారీ విజయాన్ని సాధించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో కూడా డైరెక్టర్ నాగ్ అశ్విన్ భిన్నమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ సాధారణ జీవనశైలిని కొనసాగిస్తుండడం ఇండస్ట్రీలో దక్కలేని ప్రత్యేకతగా మారింది.

  Last Updated: 08 Apr 2025, 02:14 PM IST