Site icon HashtagU Telugu

Director Lingusamy : హీరో రామ్ సినిమా డైరెక్టర్‌కు ఆరు నెలలు జైలు శిక్ష.. డైరెక్టర్ ఏమన్నాడో తెలుసా?

Director Lingusamy was jailed for six months

Lingusaamy

Director Lingusamy :  తమిళ్ డైరెక్టర్ లింగుసామి గతంలో ఆనందం, రన్, ఆవారా, పందెంకోడి లాంటి సూపర్ హిట్ సినిమాలను తీసాడు. కానీ గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉన్నాడు లింగుసామి. ఇటీవలే హీరో రామ్(Ram) తో తెలుగు, తమిళ్ లో ది వారియర్(The Warrior) అనే సినిమా తీసినా అది కూడా పరాజయం పాలైంది. తాజాగా డైరెక్టర్ లింగుసామికి ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

లింగుసామి, అతని సోదరుడు కలిసి గతంలో తిరుపతి బ్రదర్స్ అనే ఓ నిర్మాణ సంస్థని స్థాపించారు. 2014 లో PVP సంస్థ నుంచి కోటి ముప్పై లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు లింగుసామి. కార్తీ, సమంత జంటగా ఓ సినిమాని ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమా మొదట్లోనే ఆగిపోయింది. ఆ తర్వాత లింగుసామి, అతని సోదరుడు అప్పు తీర్చలేదు. కొన్నాళ్ల తర్వాత ఓ చెక్కు ఇవ్వడంతో అది కాస్తా బౌన్స్ అయింది.

దీంతో PVP సంస్థ కొన్ని నెలల క్రితం కోర్టుని ఆశ్రయించగా మొదట ఈ చెక్ బౌన్స్ కేసులో తమిళనాడు సైదాపేట్ కోర్టు లింగసామికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కానీ లింగుసామి ఈ తీర్పుపై మద్రాస్ కోర్టులో అప్పీల్ చేశారు. తాజాగా నేడు మద్రాస్ ప్రిన్సిపాల్ సెషన్స్ కోర్టు కూడా ఇదే తీర్పు ఇస్తూ లింగసామికి ఆరునెలల జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే లింగుసామి దీనిపై మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుని తమిళనాడు హైకోర్టులో అప్పీలు చేస్తామని తెలిపాడు.

 

Also Read :      Guna Sekhar : మన తెలుగు హీరోలు అలా చేయరు.. బాలీవుడ్ హీరోలని పొగిడిన డైరెక్టర్..