హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. సోమవారం గచ్చిబౌలి(Gachibowli )లోని రాడిసన్ హోటల్(Radisson Hotel) ఫై పోలీసులు దాడి జరుపగా.. భారీగా డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్ తీసుకుంటున్న బిజెపి నేత(Politician) కుమారుడు గజ్జల వివేకానందతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు నటి లిషి గణేష్ (Lishi Ganesh) పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇక ఇప్పుడు మరికొంతమంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ (Director Krish) సైతం డ్రగ్స్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. FIRలో 8వ నిందితుడిగా ఆయన పేరును చేర్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆదివారం రాత్రి పార్టీ జరిగిన రూమ్‌లో క్రిష్ అరగంట పాటు కూర్చున్నాడని, డ్రైవర్ లేని సమయంలో వివేకానందతో కాసేపు మాట్లాడారని తెలిపారు. అయితే, హోటల్ యజమానితో తనకు అప్పుడే పరిచయం ఏర్పడిందని క్రిష్ చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై దర్శకుడు క్రిష్ స్పందిస్తూ.. తాను రాడిసన్ హోటల్‌కు వెళ్లినట్టు స్పష్టం చేసారు. సాయంత్రం స్నేహితులను కలవడానికి వెళ్లానని, అరగంట పాటు గడిపానని చెప్పారు. పోలీసులు నన్ను ప్రశ్నించారని, ఎందుకు వెళ్లానో.. ఎవర్ని కలిశానో స్టేట్‌మెంట్ ఇచ్చానని తెలిపినట్లు క్లారిటీ ఇచ్చారు.
ఇక 2009లో శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యోగానంద్ కుమారుడు వివేకానంద హోటల్ లో మూడు రోజులుగా పార్టీ ఇస్తున్నాడు. ఆ హోటల్ కూడా యోగానంద్‌దేనని తెలుస్తోంది. అయితే గత 3 రోజులుగా ఈ ముగ్గురు యువకులు పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటె రాడిసన్ హోటల్ యజమాని యోగానంద్ కి అల్లు అరవింద్ తనయుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ సంబంధాలు ఉన్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా పోలీస్ విచారణలో ప్రముఖుల పేర్లు బయటికి వచ్చేలా కనిపిస్తోంది. చూద్దాం ఈ కేసు ఎక్కడివరకు వెళ్తుందో..ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో..!!
Read Also : Bandla Ganesh : రోజా..పులుసు పాప అంటూ మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్