Murari Sequel : మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి సినిమా అప్పట్లో భారీ విజయం సాధించి ఒక క్లాసిక్ హిట్ లా నిలిచింది. ఈ సినిమాలో సాంగ్స్ అయితే ఎప్పుడు విన్నా బోర్ కొట్టవు. ఇలాంటి క్లాసిక్ హిట్ సినిమా మురారిని ఇటీవల ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజున రీ రిలీజ్ చేసారు. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాల రికార్డులన్నీ లేపేసింది మురారి.
దాదాపు 8 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మురారి సినిమా అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు రీ రిలీజ్ సినిమాగా నిలిచింది. అలాగే బుక్ మై షోలో కూడా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన రీ రిలీజ్ సినిమాగా నిలిచింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మురారి రీ రిలీజ్ అన్నప్పట్నుంచి ఫ్యాన్స్, నెటిజన్లతో కృష్ణవంశీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. పలువురు అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు, పోస్ట్ చేసిన ట్వీట్స్ కి రిప్లైలు ఇస్తున్నారు.
తాజాగా ఓ నెటిజన్ ఇంకో రెండు సంవత్సరాల తర్వాత మహేష్ బాబు కొడుకు గౌతమ్ డెబ్యూట్ ని మురారి సీక్వెల్ తో లేదా రీమేక్ తో ప్లాన్ చేయండి సర్ అని కృష్ణవంశీని అడిగాడు. దీనికి కృష్ణవంశీ సమాధానమిస్తూ.. అది మీరు, నేను కాదండి.. మహేష్ బాబు, నమ్రత, గౌతమ్ డిసైడ్ చెయ్యాలి. వాళ్లనే డిసైడ్ చేయనిద్దాం అని రిప్లై ఇచ్చారు. దీంతో మహేష్, నమ్రత, గౌతమ్ ఓకే అంటే కృష్ణవంశీ మురారి సీక్వెల్ కి రెడీ గా ఉన్నట్టే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి గౌతమ్ ఏ సినిమాతో డెబ్యూట్ ఇస్తాడో చూడాలి.
Adi meeru nenu kadandi ..MAHESHBABU ,namratha garu n goutham decide cheyyalandi … వాళ్ళని cheyaniddaam…. THQ ❤️🙏 https://t.co/f4eE6VNA46
— Krishna Vamsi (@director_kv) August 12, 2024
Also Read : Sai Durgha Tej – Vaishnav Tej : అమ్మకు స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన మెగా మేనల్లుళ్లు..