Krishnam Vande Jagadgurum : మూడు కథలను కలిపి ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ తీసిన క్రిష్..

ఒక సమయంలో సిరివెన్నెల, క్రిష్‌కు జగద్గురువు తత్వం గురించి బోధించారట. అది విన్న క్రిష్ దశావతారాల కాన్సెప్ట్‌తో ఒక మూవీ చేస్తే బాగుంటుందని భావించాడట.

  • Written By:
  • Publish Date - November 4, 2023 / 05:27 AM IST

రానా(Rana), నయనతార(Nayanthara) ప్రధాన పాత్రల్లో క్రిష్‌(Director Krish) తెరకెక్కించిన సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’(Krishnam Vande Jagadgurum). భాగవతలీలల అంతరార్థాన్ని కమర్షియల్ ఫార్మేట్ లో చూపించిన సినిమా ఇది. డైరెక్టర్ క్రిష్ తన మొదటి రెండు సినిమాలు ‘గమ్యం’, ‘వేదం’తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మూడో సినిమా విషయంలో మూడు కథలను అనుకోని.. ఏది తియ్యాలో తెలియక సందిగ్ధంలో పడ్డాడట. చివరికి ఆ మూడు కథల్ని కలిపి ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ తెరకెక్కించాడట.

పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే క్రిష్‌కు ఎంతో అభిమానం. అందుకే అతని ప్రతి సినిమాలో ఆయనతో తప్పకుండా ఒక్క పాట అయినా రాయించేవాడు. అయితే ఒక సమయంలో సిరివెన్నెల, క్రిష్‌కు జగద్గురువు తత్వం గురించి బోధించారట. అది విన్న క్రిష్ దశావతారాల కాన్సెప్ట్‌తో ఒక మూవీ చేస్తే బాగుంటుందని భావించాడట. అయితే క్రిష్ అప్పటికే ‘సురభి నాటకాలు’ కథాంశంతో ఒక డ్యాక్యుమెంటరీ తీయాలని ప్లాన్ చేశాడు. అలాగే మైనింగ్‌ మాఫియా అక్రమాలను చూపిస్తూ కూడా ఒక చిత్రాన్ని తెరకెక్కించాలని ఎప్పటినుంచో ఆలోచనలో ఉన్నాడట.

ఇక ఈ మూడు కథలు మూడు నేపథ్యాలు కావడంతో ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో పడ్డాడు. అయితే చివరికి మూడు కథలను ఒకటిగా కలిపి.. ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ సినిమాని రాసుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్‌ హంగులతో తెరకెక్కినప్పటికీ.. మూవీలోని పాత్రలు, సంభాషణలు ప్రేక్షకులకు ఒక దృశ్యకావ్యం చూసిన అనుభూతుని ఇచ్చింది. ముఖ్యంగా సినిమా ఇతివృత్తాన్ని తెలియాజేసే.. టైటిల్ సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటకి సీతారామశాస్త్రి లిరిక్స్ రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన గాత్రంతో ప్రాణం పోశారు. ముందుగా ఈ పాట 15 నిమిషాలు వచ్చిందట. అయితే క్రిష్ దానిని ఇంకా కుదించి చివరికి 12 నిమిషాలకు కుదించారు. ఈ పాట ఎప్పుడు విన్నా గూంజ్ బంప్స్ రావడం ఖాయం.

 

Also Read : Vijay Devarakonda : చిన్నారికి సాయం చేసి విజయ్ తన గొప్ప మనసు చాటుకున్నాడు