టాలీవుడ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు ఎదిగిన ప్రభాస్(Prabhas).. మొదటి అడుగుని ఎలా వేశాడో తెలుసా..? కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. ‘ఈశ్వర్'(Eshwar) సినిమాతో తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ వెనుక జరిగిన కథని దర్శకుడు జయంత్ సి.పరాన్జీ ఒక ఇంటర్వ్యూలో అభిమానులకు తెలియజేశాడు. దర్శకుడు జయంత్, మహేష్ బాబుతో ‘టక్కరి దొంగ’ మూవీ చేస్తున్న టైంలో.. నిర్మాత అశోక్ కుమార్‌తో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడట.
ఇక లవ్ స్టోరీస్ ని తెరకెక్కించడానికి ఎక్కువ ఇష్టపడే జయంత్.. ఆ సినిమాని కూడా ప్రేమ కథతో తెరకెక్కించాలి, కానీ అందులో కొంచెం యాక్షన్ కూడా ఉండాలని భావించాడు. అదికూడా తక్కువ బడ్జెట్‌లోనే మూవీ అయిపోవాలి. దీంతో కొత్త నటుడు అయితే బెటర్ అని దర్శకుడు భావించాడు. ఇక కొత్త నటుడు కోసం వేట మొదలు పెట్టారు. ఈక్రమంలోనే సత్యానంద్ యాక్టింగ్ స్కూల్ లో కృష్ణంరాజు సోదరుడి కొడుకు ప్రభాస్ అనే కుర్రాడు నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని తెలుసుకున్నాడు.
ఇంకేముంది వెంటనే ప్రభాస్ ఫోటోలు కూడా తెప్పించుకొని చూశాడు. అవి చూడగానే హీరో మెటీరియల్‌లా ఉన్నాడని అనుకున్నాడట. దీంతో ఒక హోటల్ లో ప్రభాస్ ని కలుసుకొని సినిమా విషయం చెప్పాడట. దానికి ప్రభాస్ బదులిస్తూ.. “నా యాక్టింగ్ ట్రైనింగ్ ఇంకా పూర్తికాలేదండి. నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి” అంటూ కోరాడట. దానికి జయంత్ బదులిస్తూ.. నీకు ఇంకా ట్రైనింగ్ అవసరం లేదు. ఈ సినిమా నువ్వు చేస్తున్నావు అని ఫైనల్ చేసేశాడట.
దీంతో ప్రభాస్ ట్రైనింగ్ పూర్తికాకముందే దర్శకుడి మీద నమ్మకం ఉంచి హీరోగా ప్రయాణం మొదలు పెట్టేశాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కంటే ముందు మరో హీరో ఫోటోలను కూడా పరిశీలించారట. అతడు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారసుడే అని పేర్కొన్నాడు. అతను కూడా ప్రభాస్‌లా ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడట. అయితే అతను ఎవరు అన్నది జయంత్ తెలియజేయలేదు.
Also Read : Leo Collections : లియో సినిమా కలెక్షన్స్ ఫేక్? థియేటర్స్ ఓనర్స్ ఆగ్రహం.. స్పందించిన డైరెక్టర్..