ఇటీవల కాలంలో గుండెపోటు (Heart Attack) మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా ముందు వరకు కూడా గుండెపోటు మరణాలు తక్కువగా నమోదు అవుతూ ఉండేవి..అవి కూడా 60 , 70 ఏళ్ల పైబడిన వారు గుండెపోటుకు గురయ్యి మరణించేవారు..కానీ ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. ఐదేళ్ల చిన్నారుల దగ్గరి నుండి 90 ఏళ్ల ముసలాడి వరకు ఇలా అందరికి గుండెపోటు అనేవి వస్తున్నాయి. అప్పటివరకు సంతోషంతో మన మద్యే ఉన్న వారు సడెన్ గా కుప్పకూలి..అక్కడిక్కడే మృతి చెందుతున్నారు. ప్రతి రోజు ఈ తరహాలు ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా చిత్రసీమలో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. ప్రముఖ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె. జయదేవ్ (Director Jayadev Dies) సోమవారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. పలు షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించిన జయదేవ్ ‘కోరంగి నుంచి’ (2022) అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ) నిర్మించింది. మంచి చిత్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్‌ఎఫ్‌డీసీ ప్రతి ఏడాది కొన్ని చిత్రాలకు ఫండింగ్ ఇస్తుంది. అందులో భాగంగా ‘కోరంగి నుంచి’కి కోటి రూపాయల ఫండింగ్ ఇచ్చారు. 25 ఏళ్ల తర్వాత నటి అర్చన ఈ సినిమాలో నటించటం విశేషం. ఈ చిత్రం పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.జయదేవ్‌కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Read Also : AP : రేవంత్ కు తుంటి ఏమీ విరగలేదు కదా? జగన్ ఆయనను పరామర్శించడానికి – కొడాలి నాని