Site icon HashtagU Telugu

HHVM Trailer : వీరమల్లు ట్రైలర్ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ కు చేదు అనుభవం

Director Anudeep

Director Anudeep

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Harihara Viramallu) ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో అట్టహాసంగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకుడు అనుదీప్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి అనుదీప్ సాదా సీదాగా, ప్రత్యేకమైన ప్రోటోకాల్ లేకుండా వచ్చారు. దీంతో ఆయనను కొంతమంది పోలీసులు గుర్తుపట్టకపోవడంతో అడ్డుకొని తోసేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “పాపం అనుదీప్” అంటూ నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ వస్తున్నారు.

Lakdikapul : మాజీ సీఎం రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్‌, ఖర్గే

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. విడుదలైన 24 గంటలలోనే 46.2 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ చరిత్రలో ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ స్థాయిలో వ్యూస్ తెచ్చుకున్న ట్రైలర్ పుష్ప-2 (44.67 మిలియన్) మాత్రమే. ఇప్పుడు ఆ రికార్డును ‘హరి హర వీరమల్లు’ బ్రేక్ చేసింది. పవన్ కళ్యాణ్ మాస్ అడియన్స్‌లో ఎంతగానో క్రేజ్ ఉన్న సంగతి ఈ వ్యూస్ ఆధారంగా మరోసారి రుజువైంది.

ఈ చిత్రాన్ని క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందించారు. పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, అరవింద్ స్వామి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్వాతంత్ర్య పూర్వ భారతంలో ఆధారితంగా ఈ కథ రూపొందినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ , డైలాగ్స్ , విజువల్స్, BGM స్కోర్ అన్నీ కలిపి సినిమా పట్ల భారీ అంచనాలు పెంచాయి. జూలై 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.