Site icon HashtagU Telugu

Vaishnavi : బేబీ ని కలిసిన పవన్ డైరెక్టర్..ఛాన్స్ ఇచ్చినట్లేనా..?

Harish shankar meets vaishnavi

Harish shankar meets vaishnavi

బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి..ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. షార్ట్స్ ఫిలిమ్స్ తో యూత్ ను ఆకట్టుకున్న ఈమె..ఇప్పుడు బేబీ (Baby) మూవీ తో యావత్ ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె కోసం దర్శక , నిర్మాతలు పోటీ పడుతున్నారు. మొదటి సినిమాలోనే బోల్డ్ రోల్ లో నటించి పెద్ద సాహసం చేసిందని సినీ ప్రముఖులంతా చెపుతూ.. రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమని కితాబ్ ఇస్తున్నారు. యూత్ సైతం వైష్ణవి జపం చేస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకోవాలని చాలామంది దర్శక , నిర్మాతలు చూస్తున్నారు. అందుకే ఆమె కాల్ షీట్స్ కోసం ఎగబడుతున్నారు.

తాజాగా గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్..బాబీ ని కలిశారు. ఈ విషయాన్నీ హరీష్ తన ట్విట్టర్ ద్వారా తెలుపడం జరిగింది. టాలెంట్ గర్ల్ వైష్ణవిని కలిశానని..ఆమెను కలవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని , రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ కావడం ఖాయమని తెలిపాడు. హరీష్ మాటలు వింటుంటే తన నుండి వచ్చే సినిమాల్లో వైష్ణవి కి ఛాన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం హరీష్..పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నాడు.

సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన బేబీ మూవీ లో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరో గా నటించగా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా జులై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. కేవలం హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే రూ. 75 కోట్లు రాబట్టిన ఈ మూవీ వంద కోట్ల వరకు పరుగులు పెడుతుంది. రెండు వారాలైనా సినిమా కు క్రేజ్ తగ్గకపోవడం తో మేకర్స్ ఇంకాస్త ప్రమోషన్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతే కాదు ఈ సినిమాలో కొత్త పాట సహా దాదాపు 14 నిమిషాలపాటు కట్ చేసిన సీన్స్ మళ్లీ యాడ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి బేబీ కొత్త వెర్షన్ సినిమా థియేటర్లలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

https://twitter.com/harish2you/status/1685348405625716736?s=20

Read Also : తమిళనాడు సీఎం స్టాలిన్ కు జనసేన అధినేత లేఖ..