Site icon HashtagU Telugu

Tollywood : ఉప్పెన ఫేమ్ ‘బుచ్చిబాబు’ ఇంట్లో విషాదం ..

Buchhibabu

Buchhibabu

టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీ లో మరో విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా చిత్రసీమలో వరుస విషాద సంఘటనలు సినీ లవర్స్ ను దిగ్బ్రాంతికి గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం, రోడ్డు ప్రమాదం, ఆత్మహత్య, గుండె పోటు వంటి కారణాలతో ప్రముఖులు తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. ఇక వారి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులను తీవ్ర విషాదంలో నెలకొంటుంది. నిన్న ప్రముఖ నిర్మాత చినబాబు తల్లి నాగమ్మ అనారోగ్యం తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈమె అంత్యక్రియలు ఈరోజు ఫిలిం నగర్ మహాప్రస్థానంలో జరగనుండగా..ఇప్పుడు మరో విషాద వార్త బయటకు వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఉప్పెన ఫేమ్ ‘ఉప్పెన’ బుచ్చిబాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బుచ్చిబాబు (Buchhibabu) తండ్రి పెదకాపు అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటంబం శోకసముద్రంలో మునిగిపోయింది. నేటి సాయత్రం పెదకాపు స్వగ్రామం అయిన యు.కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. పెదకాపు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ నివాళులు అర్పించారు. తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకముందు కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్‌ లెక్చరర్‌గా సుక్కు పనిచేశారు. అదే కాలేజీలో బుచ్చిబాబు స్టూడెంట్‌. సుకుమార్‌ పాఠం చెప్పే తీరుకి ఆకర్షితుడై.. ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టారు. గురువు దర్శకుడిగా మారితే.. తాను అదే బాటలో నడిచారు. ‘ఆర్య 2’ నుంచి సుక్కు వద్ద బుచ్చిబాబు సహాయ దర్శకుడిగా వర్క్‌ చేశారు. ఉప్పెనతో దర్శకుడిగా మారారు. ప్రస్తుతం బుచ్చిబాబు..రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు.

Read Also : AP : కాబోయే సీఎం చంద్రబాబే..ఆయనకే మీ సమస్యలు చెప్పుకోండి – కారుమూరి