Bobby : బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ టాలీవుడ్ డైరెక్టర్.. హృతిక్ రోషన్ తో..

ఇప్పుడు మరో డైరెక్టర్ బాబీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Director Bobby Entry into Bollywood with Hrithik Roshan

Bobby

Bobby : గత కొంతకాలంగా తెలుగు దర్శకులు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ అక్కడి హీరోలతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మన దర్శకులు బాలీవుడ్ లో కూడా సక్సెస్ అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ తో జాట్ సినిమా తీసాడు. ఈ సినిమా ఏప్రిల్ 10 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో గోపీచంద్ మలినేని కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇప్పుడు మరో డైరెక్టర్ బాబీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో రవితేజ, ఎన్టీఆర్, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలందరితో సినిమాలు తీసి సక్సెస్ కొట్టాడు బాబీ. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ తో డాకు మహారాజ్ సినిమాలు తీస్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు బాబీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని వినిపిస్తుంది.

బాబీ ఇప్పటికే హృతిక్ రోషన్ ని కలిసి స్టోరీ ఇన్ చెప్పాడట. ఆ లైన్ హృతిక్ కి నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. దీంతో బాబీ హృతిక్ కోసం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. హృతిక్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఇది అయ్యాక క్రిష్ 4 సినిమాని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా అయ్యాకే బాబీ సినిమా ఉంటుందని సమాచారం.

 

Also Read : Allu Arjun : ఫ్యామిలీతో అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటో వైరల్..

  Last Updated: 08 Apr 2025, 10:05 AM IST