Director Atlee : హాలీవుడ్ నుంచి కాల్.. స్పానిష్ లో నెక్స్ట్ సినిమా.. డైరెక్టర్ అట్లీ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

జవాన్ సినిమా సక్సెస్ తర్వాత ఇటీవల అట్లీ మాటలు కోతలు దాటుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Director Atlee said he get a call from Hollywood

Director Atlee said he get a call from Hollywood

తమిళ్ డైరెక్టర్ అట్లీ(Director Atlee) తమిళ్ లో వరుసగా నాలుగు కమర్షియల్ సినిమాలు(Commercial Movies) తీసి హిట్స్ కొట్టి ఇటీవల షారుఖ్(Shahrukh Khan) తో జవాన్(Jawan) సినిమాతో వచ్చి భారీ కమర్షియల్ సక్సెస్ సాధించాడు. అయితే అట్లీ మొదటి సినిమా తప్ప మిగిలినవి అన్ని ఒకటే కథలా, ఒకటే మేకింగ్ లా ఉంటాయి. కేవలం కమర్షియల్ డైరెక్టర్ గా మాత్రమే అట్లీ సక్సెస్ అయ్యాడు.

జవాన్ సినిమా సక్సెస్ తర్వాత ఇటీవల అట్లీ మాటలు కోతలు దాటుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో జవాన్ సినిమాని ఆస్కార్(Oscar) కి పంపిస్తాను అన్నాడు. అప్పుడే అట్లీపై భారీ ట్రోల్స్ వచ్చాయి. ఒక మాములు కమర్షియల్ సినిమా, అది కూడా సౌత్ సినిమాల కథలు మిక్స్ చేసి తీసింది.. ఆస్కార్ ఎలా తీసుకుంటుంది అని నెటిజన్లు ట్రోల్ చేశారు.

తాజాగా మరో ఇంటర్వ్యూలో.. నాకు హాలీవుడ్(Hollywood) నుంచి కాల్ వచ్చింది. హాలీవుడ్ లో ఒక సినిమాని డైరెక్ట్ చేయమని అడిగారు. అలాగే స్పానిష్(Spanish) లో కూడా నేను త్వరలో సినిమా తీయబోతున్నాను అని తెలిపాడు. దీంతో ఇది మరీ ఓవర్ అయిందని నెటిజన్లు కామెన్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ లో భారీ కమర్షియల్ హిట్ కొట్టేసరికి అట్లీ ఎక్కడా ఆగట్లేదని అంటున్నారు.

 

Also Read : Manchu Manoj Talk Show: మంచు మనోజ్ బాలయ్యకి పోటీ ఇస్తాడా.. ఫస్ట్ గెస్ట్ అతనేనా..!

  Last Updated: 24 Sep 2023, 07:27 PM IST