Site icon HashtagU Telugu

Hyderabad Traffic : పెట్రోల్ మాకేమైనా ఫ్రీ గా వస్తుందా.. అంటూ ప్రభుత్వం ఫై నటి డింపుల్ హయతి ఫైర్

dimple hayathi about Hyderabad Traffic

dimple hayathi about Hyderabad Traffic

డింపుల్ హయతి (Dimple Hayathi) మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ ట్రాఫిక్ (Hyderabad Traffic) ను ఉద్దేశించి పెట్రోల్ మాకేమైనా ఫ్రీ గా వస్తుందా అంటూ ట్రాఫిక్ డీసీపీ ని , తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డింపుల్ సినిమాలకన్నా వివాదస్పద వార్తలతో పాపులర్ అవుతూ వస్తుంది. 2017 లో ‘గల్ఫ్’ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2019లో యురేక సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు అమ్మడికి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘జర్ర జర్ర ‘ అంటూ ఓ ఐటెం సాంగ్ లో డింపుల్ చిందులేసి ఒక్కసారిగా యూత్ కు దగ్గరైంది. ఆ తర్వాత ఖిలాడీ రీసెంట్ గా గోపీచంద్ సరసన రామాబాణం మూవీస్ చేసింది. ఈ రెండు కూడా ప్లాప్స్ అయ్యాయి.

ఇదిలా ఉంటె ఈ అమ్మడు ఆ మధ్య హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే (Rahul Hegde) తో గొడవపడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి రాహుల్ హెగ్డే ఫై కోపంగా ఉన్న డింపుల్..తాజాగా తన కోపాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది. గత నాల్గు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతుండడం తో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం అవుతుండడం తో ఇంట్లో నుండి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలో నటి డింపుల్ నిన్న సాయంత్రం ఎక్కడికో వెళ్లి తన ఇంటికి తిరిగి వెళుతూ దుర్గం చెరువు ఫ్లై ఓవర్ మీద ట్రాఫిక్ లో చిక్కుకుంది.

గంటలకొద్దీ ట్రాఫిక్ లో ఉన్న ఆమె ఇంటికి వెళ్లేసరికి చాలా ఆలస్యం అయ్యింది. అంతే తన ట్విట్టర్ లో ట్రాఫిక్ రోజు రోజుకీ మరీ దారుణంగా తయారవుతోంది, ఇంటికి వెళ్ళడానికి గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. అసలు ఈ ట్రాఫిక్ డీసీపీలు అందరూ ఎక్కడున్నారు? ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏంటి పరిస్థితి? అసలు హైదరాబాద్ లో బయటకి అడుగుపెట్టే పరిస్థితి ఉందా? పెట్రోల్ మాకు ఫ్రీగా రావటం లేదు ప్రభుత్వం వారూ? అని వరుస ట్వీట్స్ తో ప్రశ్నించింది. ఈమె ట్వీట్స్ చూసిన నెటిజన్లు వర్షం పడుతుంటే ఎందుకు బయటకు వెళ్లారని ప్రశ్నింస్తున్నారు. మరికొంతమంది మీ కోపం ప్రభుత్వం మీదనా..? లేక డీసీపీ రాహుల్ మీదనా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also :Trolls On ‘Project K’: ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’పై ట్రోల్స్.. మరో ఆదిపురుష్ అంటూ కామెంట్స్!