లవర్స్ డే (Lovers Day) కు ఇంకొద్దిరోజులే ఉన్నాయి. దీంతో ఒక్కొ జంట ఒక్కొవిధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇప్పట్నుంచే ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్బాటలు లేకుండా నచ్చిన విధంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకునేవాళ్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్ లాంటింది. ప్రేమికుల కోసం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ (Dilwale Dulhania Le Jayenge) మళ్లీ మీ ముందుకు రాబోతోంది.
షారుఖ్ ఖాన్, కాజోల్ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ (Dilwale Dulhania Le Jayenge) భారతదేశం అంతటా విడుదల కానుంది. ఈ మేరకు యష్ రాజ్ ఫిల్మ్స్ స్పష్టం చేసింది. YRF డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ మల్హోత్రా మాట్లాడుతూ “దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే విడుదలైనప్పటి నుండి అనేక సంవత్సరాలుగా సినీ ప్రేక్షకులను, ముఖ్యంగా లవర్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ మూవీ రొమాన్స్ (Romance) కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి మళ్లీ మళ్లీ చూడగలిగేలా సినిమాను విడుదల చేయాలని మరోసారి భావించాం. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా (Dilwale Dulhania Le Jayenge) ఫిబ్రవరి 10 నుండి భారతదేశం అంతటా ఒక వారం పాటు థియేటర్లలో సందడి చేయబోతోంది.
యష్‌రాజ్ ఫిల్మ్స్ ప్రకారం, ముంబై, పూణే, అహ్మదాబాద్, సూరత్, వడోదర, గుర్గావ్, ఫరీదాబాద్, లక్నో, నోయిడా, డెహ్రాడూన్, ఢిల్లీ, చండీగఢ్, కోల్‌కతా, గౌహతి, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, సహా భారతదేశంలోని 37 నగరాల్లో DDLJ విడుదల కానుంది. చెన్నై, వెల్లూరు, త్రివేండ్రం సిటీల్లో రీరిలీజ్ కానుంది. ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, 1995 రొమాంటిక్ బ్లాక్‌బస్టర్, భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక కాలం నడిచిన చిత్రం. ‘‘25 సంవత్సరాల తర్వాత, ‘పఠాన్’ (Pathaan) ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా అవతరించడం అద్భుతమైన యాదృచ్చికం. “షారుఖ్ నటించిన పఠాన్ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న నేపథ్యంలో మరోహిట్ మూవీని రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని మేకర్స్ అన్నారు.
Also Read: Jayasudha Marriage: జయసుధ మూడో వివాహంపై రూమర్స్.. చక్కర్లు కొడుతున్న ఫొటో!