Site icon HashtagU Telugu

IT Raids : దిల్ రాజు భార్యను బ్యాంకుకు ఎందుకు తీసుకెళ్లినట్లు..?

It Rides Dil Raju

It Rides Dil Raju

‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) కు ఐటీ అధికారులు (IT officers) షాక్ ఇచ్చారు. మంగళవారం ఉదయం నుండి దిల్ రాజు ఇంట్లో , ఆఫీస్ లలో , ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేయడం మొదలుపెట్టారు. విచారణలో భాగంగా ఆయన భార్య తేజస్వినిని అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లారు. ఆమెను ఎందుకు తీసుకెళ్లినట్లు అని ఇప్పుడు చిత్ర సీమలో అంత మాట్లాడుకుంటున్నారు. తీసుకెళ్తే దిల్ రాజు ను లేదా శిరీష్ ను తీసుకెళ్లాలి కానీ ఆమెను ఎందుకు తీసుకెళ్లినట్లు అని ప్రశ్నిస్తున్నారు.

Rashmika Chava Look : మహారాణి లుక్ లో రష్మిక

SVC సంస్థ బ్యాలెన్స్ షీట్లు, ITR వివరాలను అలాగే దిల్ రాజ్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలోనూ తనిఖీలు చేసారు. ఏకంగా ఒకే సమయంలో 55 బృందాలు 8 చోట్ల తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయినా ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలని నిర్మించిన అగ్ర నిర్మాత, TFDC ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులలో దాడులు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది.

ఈ దాడులపై దిల్ రాజు భార్య తేజస్వి క్లారిటీ ఇచ్చింది. ” ఈ సోదాలు జనరల్ గా జరిగే సోదాలు. ఈ తనిఖీలు సినిమాలకు సంబంధించినవే. మమ్మల్ని బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయడానికి తీసుకెళ్లారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాము. ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ కావాలని అడిగారు” అంటూ క్లారిటీ ఇచ్చింది. కేవలం దిల్ రాజు ఆఫీసులలోనే కాదు మైత్రి మూవీ మేకర్స్, నిర్మాత అభిషేక్ అగర్వాల్, సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీలోనూ ఐటీ రైడ్స్ జరిగాయి.