టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి ( Shyam Sunder Reddy ) (86) నేడు సోమవారం రాత్రి కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యాంసుందర్ రెడ్డి .. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. శ్యాంసుందర్ రెడ్డి, ప్రమీలమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఒకరే దిల్ రాజు. మిగిలిన ఇద్దరు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి (Velamakucha Venkata Ramana Reddy).
We’re now on WhatsApp. Click to Join.
చిన్నతనం నుంచే ఆయనను కుటుంబ సభ్యులంతా రాజు అంటూ పిలుచుకునే వారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా కాగా.. పైచదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. సినీ పరిశ్రమలోకి వచ్చే ముందు దిల్ రాజు పలు వ్యాపారాలు నిర్వహించారు. ఆ తర్వాత సినీ డిస్ట్రిబ్యూటర్‌గా.. ఆ తర్వాత ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా హిట్ కావడంతో అప్పటి నుంచి ఆయన ‘దిల్ రాజు’గా మారారు. దిల్‌రాజు తండ్రి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.
Read Also : YSRCP : చంద్రబాబు అరెస్ట్‌ని ఖండిచిన వైసీపీ నేతలు.. రాజకీయంగా ఎదుర్కొలేకే..?