Site icon HashtagU Telugu

Dil Raju: బాలీవుడ్ లోకి దిల్ రాజు ఎంట్రీ, షాహిద్ కపూర్ తో భారీ మూవీకి ప్లాన్

Dil Raju Sensational Comments on Shakunthalam

Dil Raju Sensational Comments on Shakunthalam

సూపర్ స్టార్ విజయ్ దళపతి నటించిన తమిళ చిత్రం ‘వరిసు’తో విజయాన్ని అందుకున్న ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందకు సిద్ధమవున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగులో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన దిల్ రాజు బాలీవుడ్ లోనూ విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటున్నాడు. ఇప్పటికే ముంబైకి రెండుస్లారు వెళ్లినట్టు, షాహిద్ కపూర్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. దిల్ రాజు తన బ్రాండ్ ఈక్విటీని టాలీవుడ్ దాటి విస్తరించాలనుకుంటున్నాడు.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ (బృందావనం), మహేష్ బాబు (మహర్షి), పవన్ కళ్యాణ్ (వకీల్ సాబ్) వంటి తెలుగు స్టార్లతో బ్లాక్ బస్టర్స్ మూవీస్ ను చేశాడు. అయితే అతను ప్రస్తుతం స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ తీయబోయే మూవీ అన్ని భాషల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘గేమ్ ఛేంజర్’ భారతదేశం అంతటా తగినంత హైప్ సృష్టించింది. అయితే “దిల్ రాజు ఒక నవల ఆధారంగా సినిమా తీయాలని, అందుకోసం టీం కూడా రెడీ గా ఉన్నట్టు తెలుస్తోంది.

షాహిద్ కపూర్ చాలా ప్రతిభావంతుడైన నటుడు. ఇప్పటికే ‘ఫర్జీ’ విజయంలో దూసుకుపోతున్నాడు. “కబీర్ సింగ్,” ఉడ్తా పంజాబ్’ మరియు ‘కమీనీ’ వంటి భారీ హిట్స్ తో బాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. “షాహిద్ అన్ని రకాల పాత్రలను సులభంగా చేయగలడు, వైవిధ్యమైన పాత్రలలోకి అప్రయత్నంగా లీనం కాగలడు. సరైన స్క్రిప్ట్ దొరికితే దిల్ రాజుతో చేతులు కలుపుతాను” అని ఆయన అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇటీవల, దిల్ రాజు కూడా కంటెంట్-ఆధారిత చిత్రం ‘బలగం’తో విజయాన్ని రుచి చూశాడు. ఈ నేపథ్యంలో హిందీ చిత్ర పరిశ్రమలో సినిమాలు తీయడానికి బాలీవుడ్ వైపు చూస్తున్నాడు.

Also Read: MLC Kavitha: బతుకమ్మ పాటల సేకరణకు కవిత శ్రీకారం, స్వయంగా పాట పాడిన ఎమ్మెల్సీ!