Site icon HashtagU Telugu

Dil Raju–Vaishnavi Chaitanya: స్టేజ్ మొదటి సారి పాట పాడిన వైష్ణవి చైతన్య.. వీడియో వైరల్?

Dil Raju–vaishnavi Chaitanya

Dil Raju–vaishnavi Chaitanya

అరుణ్ దర్శకత్వంలో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం లవ్ మీ. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా పోస్టర్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసారు. రావాలి రా అంటూ సాగే మెలోడీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

అయితే ఈ పాటను స్వయంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య పాడడం విశేషం. ఈ పాటకి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా చంద్రబోస్ లిరిక్స్ రాసారు. ఇక ఈ పాటని అమల చేబోలు, గోమతి ఐయర్, అదితి భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్వీన్, సాయి శ్రేయ సింగర్స్ తో పాటు హీరోయిన్ వైష్ణవి కూడా పాడారు. ఇందుకోసం కీరవాణి, వైష్ణవికి వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారట. ఇక ఈ పాటని సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు, వైష్ణవి చేత పాడించారు. అంతేకాదు తాను హమ్ చేసారు. దిల్ రాజుకి సంగీతం పై మంచి పట్టు ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

 

తాజాగా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో వేదిక పై వైష్ణవి చైతన్యతో కలిసి దిల్ రాజు కూడా రాగం పడుతూ ఆకట్టుకున్నారు. అయితే స్టేజ్ పై కేవలం చిన్న బిట్ పాడిన వైష్ణవి చైతన్య.. రేపు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫుల్ సాంగ్ ని స్టేజి పై పడుతుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో వైష్ణవి చైతన్య కాకుండా మరో నలుగురు హీరోయిన్స్ గెస్ట్ అపిరెన్స్ కూడా ఉండబోతుందట. అది ఎవరు తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

Exit mobile version