టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (DIl Raju) హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను (ఐటీ) కార్యాలయానికి హాజరయ్యారు. ఇటీవల ఆయన నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరణ అందించాలని ఆయనకు అధికారులు నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన దిల్ రాజు అవసరమైన డాక్యుమెంట్లు, బ్యాంకు పత్రాలను తీసుకుని కార్యాలయానికి వెళ్లారు.
Tirupati Mayor : తిరుపతి డిప్యూటీ మేయర్ గా టీడీపీ అభ్యర్థి
సంక్రాంతి పండుగ సందర్భంగా దిల్ రాజు నిర్మాణంలో రెండు సినిమాలు విడుదలయ్యాయి. వీటి సంబంధించి భారీ మొత్తంలో లావాదేవీలు జరిగాయనే కారణంతో ఐటీ అధికారులు దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. సినీ పరిశ్రమలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగే నేపథ్యంలో వాటిపై స్పష్టత కోసం ఈ దాడులు నిర్వహించినట్లు వినికిడి.
దిల్ రాజుతో పాటు పలువురు టాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయి. సినీ పరిశ్రమలో ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను పెంచడానికి అధికారులు ఈ రకమైన దర్యాప్తు చేస్తుంటారు. ఇప్పటికే దిల్ రాజు సమర్పించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.