Site icon HashtagU Telugu

Dil Raju : దిల్ రాజు డెశిషన్ మార్చుకున్నాడా..?

Dil Raju Strong Decission about Star Movies

Dil Raju : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గేమ్ ఛేంజర్ తో భారీ లాసులు మూట కట్టుకున్నాడు. శంకర్ డైరెక్షన్ లో 450 కోట్ల బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెకింది. ఐతే సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. అందుకే సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రాలేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో నెగిటివిటీ వల్ల కూడా సినిమా మీద ఎఫెక్ట్ పడింది.

ఇదిలాఉంటే ఈ సినిమా వల్ల దిల్ రాజుకి ఎలా లేదన్నా 120 నుంచి 150 కోట్ల దాకా నష్టం వచ్చిందని తెలుస్తుంది. ఈ లాసులు భరించక తప్పదని తెలుస్తుంది. ఐతే చరణ్ గేమ్ ఛేంజర్ పోయినందుకు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారట. ఐతే గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో షాక్ తిన్న దిల్ రాజు ఇక మీదట భారీ సినిమాల జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యారట.

సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయ్యింది. కష్టకాలంలో దిల్ రాజుని వెంకటేష్ సినిమా ఆదుకుందని చెప్పొచ్చు. ఐతే ఇక మీదట భారీ బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లకుండా కేవలం మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలే చేయాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యారట. అంతేకాదు బ్యానర్ మొదట్లో చేసినట్టుగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.