Site icon HashtagU Telugu

Dil Raju : నా కెరీర్ లో శాకుంతలం సినిమా పెద్ద షాక్ ఇచ్చింది…

Dil Raju Sensational Comments on Shakunthalam

Dil Raju Sensational Comments on Shakunthalam

టాలీవుడ్(Tollywood) లో స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు(Dil Raju). దాదాపు 25 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు దిల్ రాజు కెరీర్ లో భారీ ఫ్లాప్స్ అంటే నాలుగైదు సినిమాలు తప్ప ఎక్కువగా లేవు. ఇటీవలే దిల్ రాజు సమంత(Samantha) శాకుంతలం(Shakunthalam) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ సినిమా భారీ అంచనాలతో రిలీజయి థియేటర్స్ లో పరాజయం చూసింది. సమంత చాలా గ్యాప్ తర్వాత బయటకి వచ్చి ప్రమోషన్స్ చేసినా శాకుంతలం సినిమా ప్రేక్షకులని మెప్పించలేదు. ఈ సినిమాతో గుణశేఖర్ కు, దిల్ రాజు కు భారీ నష్టమే వచ్చింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ శాకుంతలం సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దిల్ రాజు మాట్లాడుతూ.. నా 25 ఏళ్ళ కెరీర్ లో శాకుంతలం సినిమా పెద్ద జర్క్ ఇచ్చింది. సినిమాను నేను నమ్మాను. కానీ ప్రేక్షకులకు నచ్చలేదు. వాళ్లకు నచ్చలేదంటే నా జడ్జిమెంట్ తప్పని అర్ధం. ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాను. నా కెరీర్ లో 50 సినిమాలు నిర్మిస్తే అందులో ఫ్లాప్ అయినవి ఒక 5 సినిమాలు ఉంటాయి అంతే. అందులో శాకుంతలం చేరింది. శాకుంతలం సినిమా రిలీజ్ కి ముందు స్పెషల్ షో వేశాము. మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా రిలీజ్ రోజు మొదటి ఆటకే సినిమా పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. శాకుంతలం మొదటి రోజు చూశాక నాకు అర్థమైంది ఈ సినిమా నాకు భారీ షాక్ ఇచ్చిందని అన్నారు. దీంతో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై సమంత ఏమన్నా సమాధానం ఇస్తుందేమో చూడాలి.

 

Also Read :  Agent : ఏజెంట్ మొదటి రోజు కలెక్షన్స్ మరీ అంత తక్కువా?? ఇలా అయితే అయ్యగారికి కష్టమే..