కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) లీడ్ రోల్ లో సుజిత్ సందీప్ దర్శక ద్వయం డైరెక్ట్ చేసిన సినిమా క(Ka). దీపావళికి రిలీజైన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ అందరిని షాక్ అయ్యేలా చేసింది. ఐతే ఆ తర్వాత జితేందర్ రెడ్డి ఈవెంట్ లో సెలబ్రిటీస్ గురించి రాకేష్ వర్రె కూడా సంచలన కామెంట్స్ చేశాడు.
సెలబ్రిటీస్ వల్ల సినిమాకు ఎలాంటి ఉపయోగం లేదని వాళ్లు పిలిచినా రారని చెప్పాడు. తాను నిర్మాతగా మారి తప్పు చేశానని చెప్పాడు. ఐతే దీనికి క సక్సెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. సెలబ్రిటీస్ ఎవరి పనుల్లో వారుంటారు ఎవరి సినిమాకు రావాల్సిన అవసరం లేదని అన్నారు. అంతేకాదు కంటెంట్ ఉన్న సినిమాలు చేసి ఎవరి టాలెంట్ వారు ప్రూవ్ చేసుకోవాలని అన్నారు దిల్ రాజు (Dil Raju).
ప్రెస్ మీట్ లో ఎమోషనల్..
కిరణ్ అబ్బవరం మొన్న ప్రెస్ మీట్ లో ఎమోషనల్ అయ్యాడు. నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయ్యావు అలా ఎమోషనల్ అవ్వొద్దని అన్నారు దిల్ రాజు. క సినిమా సక్సెస్ మీట్ కు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు కూడా వచ్చారు. తాను కథలు, సినిమాలు చూస్తున్నప్పుడు క్లైమాక్స్ గెస్ చేస్తాను కానీ ఈ సినిమా క్లైమాక్స్ తనని సర్ ప్రైజ్ చేసిందని అన్నారు.
దీపావళికి వచ్చిన క తో పాటు లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. తన ఇన్నేళ్ల కెరీర్ లో దీపావళికి వచ్చిన ఐదు సినిమాలు సక్సెస్ అవ్వడం ఒక రికార్డ్ అని దిల్ రాజు అన్నారు. ఇది మళ్లీ జరుగుతుందో లేదో అని అన్నారు.
Also Read : Chiranjeevi Prabhas : ప్రభాస్ చిరంజీవి.. ఈ కాంబో పై వస్తున్న వార్తల్లో నిజమెంత..?