Site icon HashtagU Telugu

IT Raids : ఐటీ రైడ్స్‌ పై దిల్ రాజు మీడియా సమావేశం

Dilrajupm

Dilrajupm

గత ఐదు రోజులుగా టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాతల్లో ఐటీ రైడ్స్(IT Raids) జరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు తెల్లవారుజాము వరకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. గత 5 రోజుల నుంచి SVC ప్రొడక్షన్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, మ్యాంగో మీడియా ఓనర్ ఇళ్లు, కార్యాలయాలపై రైడ్స్ జరిగాయి. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ 3 రోజులపాటు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం అందరి ఇళ్లలో , ఆఫీస్ లలో సోదాలు పూర్తి కావడం తో..ఈ రైడ్స్ పై దిల్ రాజు (Dil Raju) స్పందించారు.

Mumbai Attack : ఎట్టకేలకు ముంబై ఉగ్రదాడుల నిందితుడి అప్పగింతకు అమెరికా అంగీకారం

మా ఇళ్లలో లేదా ఆఫీస్‌ల్లో ఎలాంటి అనధికారిక ఆస్తి తాలూకు పత్రాలు, అధిక మొత్తంలో డబ్బులు గుర్తించలేదు. తన వద్ద రూ.5 లక్షలు, శిరీష్ వద్ద రూ.4.5 లక్షలు, ఆఫీస్‌లో రూ.2 లక్షలు మాత్రమే ఐటీ రైడ్స్‌లో దొరికింది. అది కూడా పూర్తిగా లెక్కలు ఉన్న డబ్బు. మా అందరి వద్ద మొత్తంగా చూసుకున్నా రూ.20 లక్షల లోపు మాత్రమే డబ్బులు అధికారులు గుర్తించారు. అలాగే గోల్డ్ కు సంబదించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో మేము ఎలాంటి ఆస్తులను కొనుగోలు చేయలేదు. ఆ విషయాన్ని ఐటీ అధికారులకు తెలియజేశాం. ఐటీ అధికారులకు మీమంతా పూర్తిగా సహకరించమని రాజు తెలిపారు.

ఐటీ రైడ్స్ సమయంలోనే తన తల్లికి గుండె పోటు అంటూ వచ్చిన వార్తలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మకు గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు ఉంది. ఇటీవల దగ్గు ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేసాం..ఇప్పుడు ఆమె బాగానే ఉందని తెలిపారు. ఇక 2008లో మాపై ఐటీ రైడ్స్‌ జరిగాయి. మళ్లీ ఇప్పుడు మా ఇళ్లు, ఆఫీస్‌లపై ఐటీ అధికారులు రైడ్ చేశారు. ఏ వ్యాపారంలో ఉన్న ఇలాంటి రైడ్స్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ రైడ్స్ గురించి కొందరు తెలిసి తెలియక ఏదో జరిగిపోయినట్లు ప్రచారం చేయడం, ఏమీ లేని దాన్ని ఎక్కువగా ఊహించుకుని హైలైట్‌ చేస్తూ మీడియాలో ప్రచారం చేయడం దారుణం అని మీడియా పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసారు.