Site icon HashtagU Telugu

Dil Raju : సంక్రాంతికి దిల్ రాజు మూడు ముక్కలాట..!

Dil Raju Strong Decission about Star Movies

2025 సంక్రాంతికి స్టార్ సినిమాల రిలీజ్ హంగామా తెలిసిందే. ఐతే ఈ సన్ర్కాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి రాం చరణ్ గేం ఛేంజర్ కాగా మరో సినిమా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ రెండు సినిమాల మీద దిల్ రాజు (Dil Raju) చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అసలైతే గేం ఛేంజర్ ని క్రిస్ మస్ బరిలో దించాలని అనుకున్నారు కానీ కుదరలేదు.

ఐతే Ram Charan, గేమ్ ఛేంజర్ ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా. సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ (Venkatesh) మార్క్ కామెడీ ఎంటర్టైనర్. దిల్ రాజు తన సినిమాతో తానే పోటీ పడుతున్నాడు. ఇదిలాఉంటే సంక్రాంతికి ఈ రెండు సినిమాలతో వస్తున్న బాలకృష్ణ డాకు మహరాజ్ సినిమా కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అంటే రెండు తన బ్యానర్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నా మూడో సినిమాను కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయడం ఆయన గట్స్ ఏంటన్నది తెలిసేలా చేస్తుంది.

ఏ సినిమా హిట్ అయినా..

దిల్ రాజు రాబోయే సంక్రాంతికి మూడు ముక్కలాట ఆడనున్నాడు. మరి ఏ సినిమా హిట్ అయినా ఆయన లాభ పడ్డట్టే కానీ సొంత నిర్మాణంలో వచ్చిన సినిమాలు షాక్ ఇస్తే మాత్రం ఆయన లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐతే గేం ఛేంజర్ సినిమా శంకర్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సూపర్ అనిపిస్తుందని అంటున్నారు. మరోపక్క డాకు మహరాజ్ బాలయ్య (Balakrishna) మార్క్ మాస్ సినిమాగా వస్తుంది. ఈ రెండు సినిమాలు క్లిక్ అయ్యేలానే ఉన్నాయి.

వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వస్తుంది. సూపర్ హిట్ డైరెక్టర్ గా వరుస హిట్లు కొడుతున్న అతను ఈసారి ఏం చేస్తాడన్నది చూడాలి.

Also Read : KA : క దర్శకులతో అక్కినేని హీరో..?