Site icon HashtagU Telugu

Dil Raju : తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు.. మొదటి రోజే మీటింగ్..

Dil Raju oath taking ceremony as president of Telugu film chamber of commerce

Dil Raju oath taking ceremony as president of Telugu film chamber of commerce

నిన్న జులై 30న ఆదివారం నాడు తెలుగు ఫిలిం ఛాంబర్(Telugu Film Chamber) ఎలక్షన్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎలక్షన్స్ దిల్ రాజు(Dil Raju) ప్యానెల్, సి కళ్యాణ్(C Kalyan) ప్యానెల్ మధ్య హోరా హోరీగా జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో దిల్ రాజు ప్యానెల్ గెలుపొంది దిల్ రాజు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఒకప్పుడు కేవలం తన సినిమాలు మాత్రమే చూసుకునే దిల్ రాజు కరోనా తర్వాత నుంచి టాలీవుడ్ అన్ని యూనియన్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ సారి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపొందారు.

నేడు దిల్ రాజు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల 6 నిముషాలకు ఛార్జ్ తీసుకున్న దిల్ రాజు మొదటి రోజే ఆయన అధ్యక్షతన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఈసీ మీటింగ్ నిర్వహించారు. గెలిచిన వెంటనే ఫిల్మ్ ఛాంబర్ సమస్యలపై దృష్టి పెడతానని చెప్పి సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ సమస్యలపై చర్చలు చేశారు. సుదీర్ఘ కాల సమస్యలను ముందుగా పరిష్కారం చేసే దిశగా చర్చలు జరిగాయి. మరి దిల్ రాజు అధ్యక్షతన టాలీవుడ్ కి ఎంతవరకు మంచి జరుగుతుందో చూడాలి.

 

Also Read : Ask Urvashi : మరోసారి పవన్ కళ్యాణ్ కు ‘జై’ కొట్టిన ఊర్వశి రౌతేలా