ఏపీ డిప్యూటీ సీఎం తో దిల్ రాజు (Dil Raju) స్పెషల్ మీటింగ్ నేడు జరగనుంది. తెలంగాణా ఎఫ్.డీ.సీ చైర్మన్ గా ఇటీవలే ఎంపికైన దిల్ రాజు సంధ్య థియేటర్ ఘటనలో ప్రభుత్వం, ఇండస్ట్రీ మధ్య సంధి కుదిర్చే ఏర్పాటు చేశారు. ఇక ఇదిలాఉంటే సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా పిలిచే ఏర్పాటు చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఆ ఈవెంట్ కి వస్తే మెగా ఈవెంట్ గా మారుతుంది. దానికి కావాల్సిన వెన్యూ తో పాటుగా టైం కూడా ఫిక్స్ చేసేలా దిల్ రాజు పవన్ కళ్యాణ్ ఈవెంట్ జరగనుంది. అంతేకాదు టాలీవుడ్ డెవలప్ మెంట్ కి ఏపీ ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ అవసరమని దానికి సంబందించిన విషయాలను కూడా ఈ మీటింగ్ లో చర్చించనున్నారు.
దిల్ రాజు ఆదివారం విజయవాడలో రామ్ చరణ్ అతి పెద్ద కటౌట్ ని లాంచ్ చేయడానికి వచ్చారు. ఇదే ఈవెంట్ లో ట్రైలర్ ని జనవరి 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. గేమ్ ఛేంజర్ (Game Changer) ఈవెంట్ కి పవర్ స్టార్ గెస్ట్ గా వస్తారని చెప్పారు దిల్ రాజు. ఈ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా చేస్తామని దిల్ రాజు చెప్పారు. దిల్ రాజు కామెంట్స్ తో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి ఈ ఈవెంట్ ఎప్పుడు చేస్తారన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది.